దొండకాయ‌లే కాదు ఆకుల‌తో కూడా అదిరిపోయే ప్ర‌యోజ‌నాలు మీసొంతం?

దొండ‌కాయలు వీటి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.ముఖ్యంగా మ‌న భార‌తీయులు దొండ‌కాయ‌ల‌ను విరి విరిగా ఉప‌యోగిస్తుంటారు.

దొండ‌కాయ‌ల‌తో కూర‌, ఇగురు, మ‌సాలా క‌ర్రీ, వేపుడు, ప‌చ్చ‌డి, ఊర‌గాయ‌ ఇలా ర‌క‌ర‌కాలుగా త‌యారు చేస్తుంటారు.

అయితే దొండ‌కాయ‌ల‌తో ఏ వంట‌కం చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది.కేవ‌లం రుచిలోనే కాదు.

ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలోనూ దొండ‌కాయలు ముందుంటాయి.దొండ‌కాయ‌ల తిన‌డం వ‌ల్ల వెయిట్ లాస్‌, బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉండ‌టం, జీర్ణ వ్యవస్థ చురుగ్గా ప‌ని చేయ‌డం, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధి వ‌చ్చే రిస్క్ త‌గ్గ‌డం, గుండె ఆరోగ్యం మెరుగుప‌డ‌టం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్ర‌యోజ‌నాలే ఉన్నాయి.

అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే చాలా మందికి దొండ‌కాయ‌ల గురించే తెలుసు గాని దొండ ఆకుల గురించి ప‌ట్టించుకోరు అయితే వాస్త‌వానికి దొండకాయ‌లే కాదు దొండ ఆకులు కూడా అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

"""/" / ముప్పై గ్రాముల దొండ ఆకుల నుంచి ర‌సం తీసుకుని ఆ ర‌సాన్ని ప్ర‌తి రోజు సేవిస్తే శ‌రీర ఉష్ణోగ్రత అదుపులో ఉండ‌డంతో పాటు రోగ నిరోధక శ‌క్తి కూడా పెరుగుతుంది.

అలాగే డ‌‌యాబెటిస్ స‌మ‌స్య‌తో కోట్ల మంది బాధ ప‌డుతున్నారు.అయితే డ‌యాబెటిస్ స‌మ‌స్య‌ను పూర్తిగా నివారించ‌డంలోనూ దొండ ఆకులు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

ప్ర‌తి రోజు ఉదయం పూట దొండ ఆకుల ర‌సం తీసుకుని తాగితే మ‌ధుమేహం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

"""/" / ఇక విరేచనాల సమస్యను నివారించ‌డంలోనూ దొండ ఆకులు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

విరేచ‌నాల‌తో ఇబ్బంది ప‌డుతున్న‌ప్పుడు.ముప్పై గ్రాముల దొండ ఆకుల నుంచి ర‌సం తీసుకుని రోజుకు రెండు సార్లు సేవిస్తే త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొందుతారు.

అలాగే దొండ ఆకుల నుంచి త‌యారు చేసుకున్న ర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల‌ ఆస్తమ, జాండీస్ వంటి స‌మ‌స్యలు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

టాలీవుడ్ లో రాబోతున్న త్రీక్వెల్ సినిమాస్ ఇవే..?!