ప్రతి సీజన్‌లోనూ విరివిరిగా దొరికే కూరగాయల్లో దొండకాయ ఒకటి.దొండకాయతో రకరకాల కూరలు చేస్తుంటారు.
ఎలా చేసినా.అద్భుతంగానే ఉంటాయని చెప్పాలి.
అయితే కొందరు మాత్రం దొండకాయను తినడానికి అస్సలు ఇష్టపడరు.కానీ, అదే మీరు చేసే పొరపాటు.
ఎందుకంటే.దొండకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మరియు ఎన్నో అనారోగ్య సమస్యలను సైతం దూరం చేస్తుంది.మరి దొండకాయ తింటే ఏమేమి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం వ్యాధిగ్రస్తులు దొండకాయ తింటే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఎందుకంటే, రక్తంలోని చెక్కర స్థాయిలను తగ్గించడంలో దొండకాయ గ్రేట్‌గా సహాయపడుతుంది.
అలాగే క్యాల్షియమ్, మెగ్నీషియమ్ వంటి పోషకాలు ఉన్న దొండకాయ తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.
ఇక ప్రాణాంతక వైరస్ కరోనా నుంచి రక్షించుకోవాలంటే.రోగ నిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యమన్న సంగతి తెలిసిందే.
అయితే విటమిన్ సి పుష్కలంగా ఉంటే దొండకాయ తింటే శరీర రోగ నిరోధక శక్తి బలపడుతుంది.
దొండ కాయలో ఫైబర్ కూడా ఉంటుంది.కాబట్టి, దొండ కాయ ను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు నయం అవ్వడంతో పాటు మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
"""/"/
అలాగే దొండకాయలో ఉండే పొటాషియం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి.
గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.బరువు తగ్గాలనుకునే వారు దొండకాయ తింటే.