తేనె, ఉసిరి క‌లిపి తీసుకుంటే.. ఆ జ‌బ్బులు దూరం!

ఈ వింట‌ర్ సీజ‌న్‌లో విరి విరిగా ల‌భించే ఉసిరి కాయ‌లు ఆరోగ్య ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.

అలాగే ఎన్నో పోష‌క విలువ‌లు క‌లిగి ఉండే తేనె గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అయితే ఉసిరి కాయ‌లు, తేనె విడి విడిగా రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలుసు.

కానీ, ఈ రెండిటినీ క‌లిపి తీసుకుంటే.మ‌రిన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎన్నో ర‌కాల జ‌బ్బుల‌ను నివారించ‌డంలో.తేనె, ఊసిరి కాంబినేష‌న్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ముందుగా కొన్ని ఉసిరి కాయ‌ల‌ను నీటిలో క‌డిగి ఆర‌బెట్టుకోవాలి.అనంత‌రం ఒక గాజు జారు తీసుకుని అందులో స‌గానికి స్వ‌చ్ఛ‌మైన తేనె నింపాలి.

ఇప్పుడు అందులో ముందుగా క‌డిగి పెట్టుకున్న ఉసిరి కాయ‌ల‌ను వేసి.స్టోర్ చేసుకోవాలి.

ఒక మూడు, నాలుగు రోజుల త‌ర్వాత నుంచి తేనెలో ఊరిన ఉసిరి కాయ‌ల‌ను రోజుకు ఒక‌టి లేదా రెండు చ‌ప్పున తీసుకుంటే.

ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇలా తేనెలో నాన‌బెట్టిన ఉసిరిని తిన‌డం వ‌ల్ల.

అందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బయోటిక్ గుణాలు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌ప‌రుస్తుంది.

"""/"/ ఫ‌లితంగా.వైరస్‌లు, బాక్టీరియాలు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

ముఖ్యంగా ఈ వింట‌ర్ సీజ‌న్‌లో తేనె, ఉసిరి క‌లిపి తీసుకుంటే.జ‌లుబు, ద‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు, ఆస్త‌మా వంటి స‌మ‌స్య‌ల‌ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

అలాగే బ‌రువు త‌గ్గాలి అని భావించే వారు తేనె, ఉసిరి క‌లిపి తీసుకుంటే చాలా మంచిది.

ఎందుకంటే, తేనె మ‌రియు ఉసిరి మిశ్రమం వల్ల శరీరంలో ఉన్న అద‌న‌పు కొవ్వు క‌రిగిపోతుంది.

దాంతో అధిక బ‌రువు స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.తేనె మ‌రియు ఉసిరి మిశ్రమం తీసుకోవ‌డం వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్య మెరుగు ప‌డుతుంది.

ఇక రెగ్యుల‌ర్‌గా తేనె మ‌రియు ఉసిరి మిశ్ర‌మం తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ముడ‌త‌లు త‌గ్గి య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు.

అంతేకాదు, స్త్రీలలో రుతు సంబంధ సమస్యల‌ను దూరంగా చేయ‌డంలోనూ, పురుషుల్లో వీర్య నాణ్యత పెంచ‌డంలోనూ, జీర్ణ స‌మ‌స్య‌ల‌ను నివారిండ‌చంలోనూ తేనె, ఉసిరి మిశ్ర‌మం ఉప‌యోగ‌ప‌డుతుంది.

కాబ‌ట్టి, తేనె మ‌రియు ఉసిరి మిశ్ర‌మాన్ని త‌ప్ప‌కుండా డైట్‌లో చేర్చుకోండి.

ప్రభాస్ సలార్2 మూవీ టార్గెట్ లెక్కలివే.. ఆ రేంజ్ కలెక్షన్లు రావడం పక్కా!