నిద్రలేమితో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ జ్యూస్ తాగాల్సిందే!

నిద్ర‌లేమిఈ మ‌ధ్య కాలంలో ఎంద‌రినో ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌స్య ఇది.ఈ నిద్ర లేమిని నిర్ల‌క్ష్యం చేస్తే అల‌స‌ట‌, ఒత్తిడి, చికాకు, ఆందోళ‌న, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు పెరిగిపోతూ ఉంటాయి.

మ‌రోవైపు ఆరోగ్యం కూడా క్ర‌మంగా దిబ్బ తింటుంది.అందుకే వీలైనంత త్వ‌ర‌గా, వీలైన విధంగా నిద్ర లేమిని దూరం చేసుకోవాలి.

అయితే నిద్ర లేమికి చెక్ పెట్ట‌డంలో బూడిద గుమ్మ‌డి జ్యూస్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

సాదార‌ణంగా బూడిద గుమ్మ‌డిని దిష్టీ తగలకూండా ఉండాల‌ని ఇంటి గుమ్మానికి క‌డుతుంటారు.అలాగే బూడిద గుమ్మ‌డితో వంటలు కూడా చేస్తుంటారు.

అలాగే బూడిద గుమ్మ‌డిలో విటమిన్ బి, విట‌మిన్ డి, విట‌మిన్ సి, ఐరన్, క్యాల్షియం, కాపర్, పొటాషియం, జింక్‌, పైబ‌ర్‌, బీటాకెరోటీన్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు దాగి ఉంటాయి.

అందుకే బూడిద గుమ్మడి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో జ‌బ్బుల‌ను నివారిస్తుంది.

ముఖ్యంగా నిద్ర లేమి స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు బూడిద గుమ్మ‌డి నుంచి జ్యూస్ తీసుకుని అందులో కొద్దిగా స్వ‌చ్ఛ‌మైన‌ తేనె క‌లిపి సేవించాలి.

ఇలా వారంలో రెండు, మూడు సార్లు చేస్తే నిద్ర లేమి స‌మ‌స్య ప‌రార్ అవుతుంది.

"""/" / అంతేకాదు, బూడిద గుమ్మడి జ్యూస్ తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

దాంతో వైర‌స్‌లు, బ్యాక్టీరియాలు ద‌రి చేర‌కుండా ఉంటాయి.అధిక వేడిని త‌గ్గించి శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే శ‌క్తి కూడా బూడిద గుమ్మ‌డికి ఉంది.

అలాగే బూడిద గుమ్మ‌డి జ్యూస్ తీసుకుంటే కిడ్నీ మరియు గాల్ బ్లాడర్ లో ఏర్ప‌డిన రాళ్లు క‌రిగి పోతాయి.

ఇక బూడిద గుమ్మ‌డిలో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది.అందువ‌ల్ల‌, బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు బూడిద గుమ్మ‌డి జ్యూస్ తీసుకుంటే వేగంగా వెయిట్ లాస్ అవుతారు.

Kaliyugam Pattanamlo Review : కలియుగం పట్టణంలో రివ్యూ.. అదిరిపోయిన ట్విస్టులు