గ్రీన్ యాపిల్ జ్యూస్ తాగితే..ఎన్ని జ‌బ్బులు దూర‌మ‌వుతాయో తెలుసా?

యాపిల్స్‌లో ఎన్నో ర‌కాలు ఉన్నాయి.వాటిలో మ‌న‌కు బాగా తెలిసిన‌వి రెడ్ ఆయిల్ మ‌రియు గ్రీన్ ఆపిల్‌.

రెండూ యాపిల్సే అయిన‌ప్ప‌టికీ రుచులు వేరు వేరుగా ఉంటాయి.రెడ్ యాపిల్ తియ్య‌గా ఉంటుంది.

గ్రీన్ యాపిల్ మాత్రం పులుపు, తీపి రుచుల‌ను క‌లిగి ఉంటుంది.రుచి విష‌యం ప‌క్క‌న పెడితే.

గ్రీన్ యాపిల్‌లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఐర‌న్‌, పొటాషియం, జింక్, కాల్షియం, కాప‌ర్‌, మాంగనీస్, ప్రోటీన్, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్యానికి గ్రీన్ యాపిల్ ఎంతో మేలు చేస్తుంది.అందులోనూ గ్రీన్ యాపిల్ జ్యూస్‌ను తీసుకుంటే అనేక జుబ్బులు దూరమ‌వుతాయి.

మ‌రి లేట్ చేయ‌కుండా గ్రీన్ యాపిల్ జ్యూస్ వ‌ల్ల వ‌చ్చే బెనిఫిట్స్ ఏంటో చూసేయండి.

ఎముక‌ల బ‌ల‌హీన‌తను నివారించ‌డంలో గ్రీన్ యాపిల్ జ్యూస్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.అవును, వారంలో నాలుగు సార్లు గ్రీన్ యాపిల్ జ్యూస్ తీసుకుంటే.

ఎముక‌లు, దంతాలు మ‌రియు కండ‌రాలు దృఢంగా మార‌తాయి. """/"/ అలాగే మ‌తిమ‌రుపుతో బాధ ప‌డే వారు త‌ర‌చూ గ్రీన్ యాపిల్ జ్యూస్ తీసుకుంటే.

అందులో ఉండే పోష‌కాలు మెద‌డు ప‌ని తీరును మెరుగుప‌రుస్తాయి.దాంతో మ‌రిమ‌రుపు త‌గ్గి జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది.

అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ ఈ జ్యూస్ ఉప‌యోగ‌ప‌డుతుంది.డైట్‌లో గ్రీన్ యాపిల్ జ్యూస్‌ను చేర్చుకుంటే శ‌రీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది.

ఇక గ్రీన్ యాపిల్ జ్యూస్ తీసుకోవ‌డం వ‌ల్ల‌ ఇందులో ఉండే ఫైబ‌ర్ కంటెంట్ మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను నివారించి జ‌ర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరును మెరుగు ప‌రుస్తుంది.

ఈ జ్యూస్‌లో ఉండే శ‌క్తివంతమైన‌ యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మాన్ని ఎల్ల‌ప్పుడు య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి.

మ‌రియు హెయిర్ ఫాల్‌ను కూడా త‌గ్గిస్తాయి.

Viral Video: నడిరోడ్డు మీద బైక్‌ పై అమ్మాయిలు, అబ్బాయిలు అసభ్యకర చర్యలు.. దాంతో పోలీసులు..?!