బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ డిష్‌ను తీసుకుంటే ఎన్ని లాభాలో..?!
TeluguStop.com
ఆరోగ్యం బాగుండాలన్నా, రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలన్నా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవడం ఎంత ముఖ్యమో.
ఉత్తమమైన బ్రేక్ ఫాస్ట్‌ను తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.ఇటీవల రోజుల్లో బిజీ లైఫ్ కారణంగా మార్నింగ్ ఏదో ఒక ఆహారాన్ని పొట్టలో పడేస్తుంటారు.
ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టుకుంటారు.అందుకే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలనే బ్రేక్ ఫాస్ట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.
అటువంటి ఫుడ్స్‌లో గోధుమ రవ్వ ఉప్మా ఒకటి.ఈ డిష్ త్వరగా అయిపోతుంది.
ఎంతో రుచిగా కూడా ఉంటుంది.పైగా గోధుమ రవ్వ ఉప్మాను బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటే బోలెడన్ని ఆరోగ్య లాభాలను పొందొచ్చు.
మరి ఆలస్యం ఎందుకు ఆ లాభాలు ఏంటో చూసేయండి.వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న వారు బ్రేక్ ఫాస్ట్‌గా గోధుమ రవ్వ ఉప్మాను తీసుకోవడం ఎంతో మంచిది.
ఈ డిష్‌లో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. """/" /
అందువల్ల, దీన్ని తీసుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలగడమే కాదు మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది.
ఫలితంగా క్యాలరీలు వేగంగా ఖర్చై.శరీర బరువు అదుపులోకి వస్తుంది.
అలాగే మధుమేహం వ్యాధి గ్రస్తులు బ్రేక్ ఫాస్ట్‌లో గోధుమ రవ్వ ఉప్మా చేర్చుకుంటే గనుక.
రక్తంలో చక్కెర స్థాయిలు సూపర్‌గా కంట్రోల్ అవుతాయి.అంతే కాదు, ఉదయం గోధుమ రవ్వతో తయారు చేసిన ఉప్మాను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పని తీరు చురుగ్గా మారుతుంది.
దాంతో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధింత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
ఇక రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు కావాల్సిన ప్రోటీన్‌ను కూడా గోధుమ రవ్వ ఉప్మాతో భర్తీ చేసుకోవచ్చు.
కాబట్టి, ఇకపై అవీ, ఇవీ కాకుండా బ్రేక్ ఫాస్ట్‌లో గోధుమ రవ్వ ఉప్మాను తీసుకోండి.
ఈ మిరాకిల్ ఆయిల్ ను వాడటం అలవాటు చేసుకుంటే హెయిర్ ఫాల్ కు గుడ్ బై చెప్పవచ్చు!