రోజుకు ఎంత నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

నెయ్యి.ఎంత రుచిగా ఉంటుంతో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

వంట‌ల్లో విరివిరిగా వాడే నెయ్యిను.చాలా మంది ఇష్టంగా తీసుకుంటారు.

అయితే కొంద‌రు మాత్రం నెయ్యి తీసుకుంటే బ‌రువు పెరిగిపోతార‌న్న భ‌యంతో దూరం పెట్టేస్తుంటారు.

కానీ, అలా చేస్తే మీ పొర‌పాటే.రోజుకు త‌గిన మోతాదులో నెయ్యి తీసుకుంటే అదిరిపోయే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు సొంతం చేసుకోవ‌చ్చు.

మ‌రి రోజుకు ఎంత నెయ్యి తీసుకుంటే.నెయ్యి వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏంటీ.

అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.రోజుకు రెండు లేదా మూడు టీ స్పూన్స్‌ నెయ్యి ఒక‌ వ్యక్తి తీసుకోవచ్చు.

ప్ర‌తిరోజు ప‌ర‌గ‌డుపున ఒక స్పూన్ నెయ్యి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది.మ‌ల‌బ‌ద్ధం స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది.

అలాగే ప్ర‌తిరోజు మోతాదు మించికుండా నెయ్యి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది.మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకుతుంది.

త‌ద్వారా గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. """/" / నెయ్యిలో ఉండే యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి శ‌రీరాన్ని ర‌క్షిస్తాయి.

కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు నెయ్యిని ఖ‌చ్చితంగా త‌మ డైట్‌లో చేర్చుకోవాలి.ఎందుకంటే, నెయ్యి లోవిట‌మిన్ ఎ పుష్క‌లంగా ల‌భిస్తుంది.

విట‌మిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే.అలాగే నెయ్యి క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా బ‌ల‌ప‌డుతుంది.

ప్ర‌స్తుతం క‌రోనా టైమ్‌లో రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డం ఎంత ముఖ్య‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక సూర్య‌ర‌శ్మి నుంచి ల‌భించే విట‌మిన్ డి కూడా నెయ్యి ద్వారా పొందొచ్చు.

చ‌ర్మ ఆరోగ్యాన్ని పెంపొందించ‌డంలోనూ నెయ్యి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.కాబ‌ట్టి, నెయ్యిను ప్ర‌తిరోజు మోతాదు మించ‌కుండా తీసుకుంటే మంచిది.

రుణమాఫీ, గ్యారెంటీలను అమలు చేస్తే రాజీనామా చేస్తా..: హరీశ్ రావు