ఈ ఒక్క వస్తువును ఇన్ని విధాలుగా ఉపయోగిస్తే.. చెడు కొలెస్ట్రాల్ బయటకు వెళ్లడం ఖాయం..!
TeluguStop.com
శరీరంలో అధిక కొలెస్ట్రాల్( Cholestrol ) పెరిగినప్పుడు అది గుండెపోటు మరియు గుండె సంబంధిత సమస్యలను కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జీవనశైలి మరియు చెడు ఆహార అలవాట్లు దీనికి కారణమని చెబుతున్నారు.అందుకే కొలెస్ట్రాల్ ధమనులలో అండుకోవడం ప్రారంభించినప్పుడు అది రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది.
అందుకే అది ప్రాణానికే ప్రమాదం తెచ్చిపెడుతుంది.కానీ మీరు వెల్లుల్లిని సరిగ్గా తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ షుగర్( Blood Sugar ) రెండు దురమవుతాయి.
ఇది ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.వెల్లుల్లిని అనేక రకాలుగా వాడే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
పచ్చి వెల్లుల్లి రెబ్బలను ( Garlic ) ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల అది కొలెస్ట్రాల్ మరియు రక్తంలో చక్కెర రెండు తగ్గుతాయి.
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ సమ్మేళనం కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా రక్తాన్ని పల్చగా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
వెల్లుల్లిని ఉడికించినప్పుడు అల్లిసిన్ దానిలో అదృశ్యమవుతుంది.కాబట్టి పచ్చి వెల్లుల్లి ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
మీకు వెల్లుల్లి వాసన నచ్చితే పచ్చి వెల్లుల్లి రెబ్బలు టీ లో కలిపి తాగవచ్చు.
మీరు ఈ టీలో దాల్చిన చెక్క పొడి( Cinnamon Powder )ని కూడా ఉపయోగించవచ్చు.
అంతే కాకుండా మీరు నిమ్మరసం మరియు తేనెను కూడా ఉపయోగించవచ్చు.అందులో టీ ఆకులు వేయకూడదు.
"""/" /
వీటన్నిటినీ కలిపి టీ తయారుచేసుకుని తాగడం ఎంతో మంచిది.ఇది చెడు కొలెస్ట్రాల్( Bad Cholestrol ) ను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
వెల్లుల్లి మరియు తేనె తయారు చేయడానికి ముందుగా వెల్లుల్లి రెబ్బలను మెత్తగా కోసి దానికి తేనే కలపాలి.
కాసేపు ఇలాగే వదిలేయాలి.తర్వాత నెమ్మదిగా నమిలి మింగాలి.
ఇది చాలా కారంగా అనిపిస్తే దానికి కొంచెం వేడి నీటిని కలపాలి.ఇంకా చెప్పాలంటే మీరు వెల్లుల్లి నూనె కూడా తయారు చేసుకోవచ్చు.
దీని కోసం వెల్లుల్లి తొక్క మరియు దాని నుంచి నూనె తీయాలి.
మాజీ బాయ్‌ఫ్రెండ్‌ని చంపాలని సూప్‌లో విషం కలిపింది.. కట్ చేస్తే షాక్..?