మధుమేహానికి చెక్ పెట్టే కొర్రలు.. కొలెస్ట్రాల్ కూడా దూరం!
TeluguStop.com
మధుమేహం.ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు.
ముఖ్యంగా ముప్పై ఏళ్లకే మధుమేహం బారిన పడుతున్న వారు ఈ రోజుల్లో మరింత పెరిగిపోతున్నారు.
దీర్ఘకాలిక వ్యాధి అయిన ఈ మధుమేహం వచ్చిందంటే.వారి బాధ వర్ణణాతీతం.
మధుమేహం ఉన్న వారు స్వీట్లకు, పలు రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి.అలాగే షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకునేందుకు మందులు వాడుతూ ఉండాలి.
అయితే మధుమేహం రోగులు రైస్‌కు బదులుగా కొర్రలు తీసుకుంటే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలు రెగ్యులర్‌గా తీసుకుంటే.రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడు అదుపులో ఉంటాయి.
అలాగే డయాబెటిక్ రోగులలో గ్లూకోజ్ స్థాయి అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలను నివారించడంలోనూ కొర్రలు అద్భుతంగా సహాయపడతాయి.
అందువల్ల, మధుమేహం ఉన్న వారు రైస్‌కు బదులుగా కొర్రలు తీసుకోవడం మంచిది.కొర్రలతో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
బరువు తగ్గాలి అని భావించే కొర్రలు డైట్‌లో చేర్చుకోవాలి. """/"/
కొర్రలు తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిపోతోంది.
శక్తిని పెంచుకుంది.మరియు శరీరంలో అదనంగా పేరుకుపోయి ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది.
ఫలితంగా అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు.అలాగే కొర్రలు తీసుకోవడం వల్ల రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు రక్తప్రసరణను వేగవంతం చేస్తుంది.
ఫలితంగా గుండె సంబంధిత జబ్బుల దరి చేరకుండా ఉంటాయి.ప్రోటీన్లు పుష్కలంగా ఉంటే కొర్రలను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల లైంగిక సమస్యలు కూడా దూరం అవుతాయి.
అలాగే ప్రతి రోజు రైస్‌కు బదులుగా కొర్రలు తీసుకోవడం వల్ల.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రాణాంతకమైన క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.
ఇక రెగ్యులర్‌గా కొర్రలు తీసుకోవడం వల్ల దృఢంగా మారతారు.మరియు జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి.
ప్రభుదేవాతో అదిరిపోయే స్టెప్పులు వేసిన రోజా… వీడియోలు వైరల్!