అవిసె గింజ‌ల‌ను ఈ విధంగా తీసుకుంటే మీ గుండె ప‌దిల‌మే!

ఇటీవల రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్న‌ వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది.

ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి, మద్యపానం తదితర కారణాల వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి.

కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు ముప్పు పెరుగుతుంది.ఈ క్రమంలోనే వివిధ రకాల గుండె సంబంధిత వ్యాధులు తలెత్తి ముప్ప తిప్పలు పెడతాయి.

అందుకే గుండె ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

అయితే అవిసె గింజలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా వాటిని ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మీ గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండ‌టం ఖాయం.

మరి ఇంకెందుకు ఆలస్యం అవిసె గింజలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి. """/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి వేయించుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న అవిసె గింజలను వేసుకోవాలి.

అలాగే మూడు వాల్ నట్స్, మూడు గింజలు తొలగించిన ఖర్జూరాలు, ఒక గ్లాసు ఇంట్లో తయారు చేసుకున్న బాదం పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తాగేయ‌డ‌మే.

ఈ అవిసె గింజల డ్రింక్ ఎంతో టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

ఈ అవిసె గింజల డ్రింక్ ను రోజుకు ఒకసారి తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

దాంతో వివిధ రకాల గుండె సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది.

పైగా ఈ అవిసె గింజల డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.

రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపు తప్పకుండా ఉంటాయి.రోజంతా యాక్టివ్ గా ఉండేందుకు అవసరమయ్యే శక్తిని సైతం లభిస్తుంది.

భార్య బాధిత టెక్కీ ‘అతుల్ సుభాష్‌’కు ఓ రెస్టారెంట్‌ వినూత్నరీతిలో నివాళి!