రాగి స్మూతీ.. బ‌రువును త‌గ్గించ‌డంతో పాటు అనేక ఆరోగ్య లాభాల‌ను అందిస్తుంది!

రాగులు.వీటి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

ధాన్యాలన్నిటిలోకి మంచి ఆరోగ్యకరమైన పోషకాహారంగా రాగుల‌ను చెబుతుంటారు.రాగుల్లో విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, ఐర‌న్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌, ఫైబ‌ర్‌, ప్రోటీన్ ఇలా అనేక పోష‌కాలు రాగుల్లో నిండి ఉంటాయి.

అందుకే అన్ని వ‌య‌సుల వారికి రాగులు ఎంతో మేలు చేస్తాయి.అయితే, రాగుల టేస్ట్ న‌చ్చ‌క‌.

వాటిని చాలా మంది ఎవైడ్ చేస్తుంటారు.అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా రాగి స్మూతీని త‌యారు చేసుకుని తీసుకుంటే.

టేస్ట్ తో పాటు బోలెడ‌న్ని ఆరోగ్య లాభాలు అందుతాయి.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం రాగి స్మూతీని ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ రాగి ఫ్లేక్స్ ను వేసుకుని చిన్న మంట‌పై ఒక‌టి, రెండు నిమిషాల పాటు వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఒక క‌ప్పు స‌పోటా పండు ముక్క‌లు, గంట పాటు వాట‌ర్‌లో నాన‌బెట్టుకున్న ఆరేడు జీడిప‌ప్పులు, వ‌న్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌, వ‌న్ టేబుల్ స్పూన్ అవిసె గింజ‌లు, వేయించి పెట్టుకున్న రాగి ఫ్లేక్స్‌, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, మూడు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, ఒక గ్లాస్ వాట‌ర్, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

"""/"/ ఇప్పుడు ఇందులో కొన్ని రాగి ఫ్లేక్స్‌, కొన్ని జీడిప‌ప్పు ప‌లుకులు, వాల్‌న‌ట్స్ ప‌లుకులు వేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ రాగి స్మూతీ సిద్ధ‌మైన‌ట్లే.

ఈ స్మూతీని డైట్‌లో చేర్చుకుంటే వేగంగా బ‌రువు త‌గ్గుతారు.ర‌క్త‌హీన‌త స‌మ‌స్య దూరం అవుతుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగి గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది.త‌ర‌చూ జీర్ణ స‌మ‌స్య‌లు ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటాయి.

మ‌రియు క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధి వ‌చ్చే రిస్క్ సైతం త‌గ్గుతుంది.

రఘురామ ఫిర్యాదు .. జగన్ పై కేసు నమోదు