మెంతి‌కూర తింటే ఆ స‌మ‌స్య‌లు రావ‌ట‌.. తెలుసా?

ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూర‌లు ఖ‌చ్చితంగా మ‌న డైట్‌లో ఉండాలంటారు ఆరోగ్య నిపుణులు.అయితే ఆకుకూర‌ల్లో ఒక‌టైన మెంతి‌కూరను చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు.

కానీ, మెంతికూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేయ‌డంతో పాటు.అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ద‌రిచేర‌కుండా ర‌క్షిస్తుంది.

ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే.మెంతికూరతో బోలెడు ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

మ‌రి ఆ ప్ర‌యోజ‌నాలు ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఇటీవ‌ల కాలంలో డయాబెటిస్ స‌మ‌స్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు.

డ‌యాబెటిస్ ఉన్న వారు ఏం తినాల‌న్నా కాస్త జంకుతారు.అయితే అలాంటి వారికి మెంతికూర ఔష‌ధంగా ప‌ని చేస్తుంది.

డయాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు వారానికి క‌నీసం మూడు సార్లు మెంతికూర తీసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

అలాగే మోంతికూరను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగి.మంచి కొడెస్ట్రాల్ పెరుగుతుంది.

"""/"/ అందుకే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు త‌ప్ప‌కుండా మొంతికూర‌ను డైట్‌లో చేర్చుకోవాలి.మెంతికూరలో ఐరన్ అత్యధికంగా దొరుకుతుంది.

కాబ‌ట్టి, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు మెంతికూర జ్యూస్ లేదా మెంతికూర‌ను ఏదో ఒక రూపం త‌ర‌చూ తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అదేవిధంగా, మలబద్ధకం స‌మ‌స్య ఉన్న‌వారు, జీర్ణ‌స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డేవారు మెంతికూర తీసుకుంటే.ఇందులో ఉండే ఫైబ‌ర్ స‌మ‌స్య‌లను దూరం చేస్తోంది.

ఇక శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెంచే విటిమిన్ సీ కూడా మెంతికూర‌లో ఉంటుంది.

ప్ర‌తి రోజు మెంతికూర‌ను నీటిలో ఐదారు గంట‌లు నానబెట్టి.అనంత‌రం ఆ నీటిని తాగితే.

గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి జ‌బ్బులు రాకుండా ఉంటాయ‌ట‌.అలాగే మ‌హిళ‌లు పీరియ‌డ్స్ స‌మ‌యంలో మెంతికూర తీసుకోవ‌డం వ‌ల్ల .

ఆ స‌మ‌యంలో వ‌చ్చే నొప్పులు త‌గ్గుతాయ‌ట‌.లివ‌ర్ స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలోనూ మెంతికూర గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బెనిఫిట్ షోల విషయంలో భారీ షాకిచ్చిన సీఎం రేవంత్.. సినిమాల కలెక్షన్లు తగ్గుతాయా?