మెంతులు, జీలకర్ర కలిపి ఇలా తీసుకుంటే ఎన్ని హెల్త్ బెనిఫిట్సో!
TeluguStop.com
మెంతులు, జీలకర్ర.వంటల్లో విరి విరిగా ఉపయోగించే ఈ రెండూ ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి.
అలాగే ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను అందిస్తాయి.వివిధ రకాల జబ్బులనూ నివారిస్తాయి.
అయితే ఈ రెండిటినీ విడి విడిగా కంటే కలిపి తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం మెంతులను, జీలకర్రను కలిపి ఎలా తీసుకోవాలి.? అసలు ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటీ.
? వంటి విషయాలను తెలుసుకుందాం పదండీ.ఒక గ్లాస్ వాటర్‌లో అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు వేసి రాత్రంతా నాన బెట్టుకోవాలి.
ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని సేవించాలి.లేదా ఒక గ్లాస్ వాటర్‌లో అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ మెంతి పొడి వేసి బాగా మరిగించి.
ఆపై ఫిల్టర్ చేసుకుని గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఇలా ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే.
"""/" /
ముఖ్యంగా అధిక బరువుతో బాధపడుతున్న వారు, వెయిట్ లాస్ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వారు.
మెంతులు, జీలకర్ర కలిపి పైన చెప్పిన విధంగా తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి క్రమంగా వెయిట్ లాస్ అవుతారు.
పరగడుపున మెంతులు, జీలకర్ర నీటిని తీసుకుంటే మలబద్ధకం దూరం అవుతుంది.జీర్ణ వ్యవస్థ పని తీరు చురుగ్గా మారుతుంది.
అలాగే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, విషపదార్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి.మెంతి, జీలకర్ర నీరు తీసుకోవడం వల్ల మధుమేహం వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గు ముఖం పడుతుంది.
ఒకవేళ మధుమేహం ఉన్న వారు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఇక మెంతులు, జీలకర్ర నీరు సేవించడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ సైతం బలపడుతుంది.
స్టార్ యాంకర్ విష్ణుప్రియకు భారీ షాక్.. ఆ బెయిల్ ఇవ్వడం అస్సలు కుదరదంటూ?