వాల్‌నట్స్ తింటే ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసా?
TeluguStop.com
వాల్‌నట్స్.వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
చూడటానికి రాళ్లలా ఉన్నా.ఇందులో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వాల్‌నట్స్‌లో ఉండే ఔషధ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి.అందుకే వాల్‌నట్స్‌ను రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు తీసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఏ వయస్సు వారైనా వాల్‌నట్స్ తీసుకోవచ్చు.వాల్‌నట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
అనేక రకాల గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది.బరువు తగ్గాలనుకునే వారికి కూడా వాల్‌నట్స్ బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే.ఇందులో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది.
దీంతో వేరే ఆహారం తినడానికి వీలు పడదు. """/" /
అలాగే వాల్‌నట్స్‌లో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలో మంచి కొవ్వును పెంచి.
చెడు కొవ్వును కరిగిస్తాయి.క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షించడంలోనూ వాల్‌నట్స్ అద్భుతంగా సహాయపడతాయి.
ఇక అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు గుప్పెడు వాల్‌నట్స్ తీసుకుంటే.బీపీ అదుపులో ఉంటుంది.
వాల్‌నట్స్ వల్ల మరో ఆరోగ్య ప్రయోజనం ఏంటంటే.షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
అందుకే మధుమేహం సమస్యతో బాధపడేవారు తమ డైట్‌లో వాల్‌నట్స్ చేర్చుకుంటే మంచిది.అలాగే వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల డిప్రెషన్, అధిక ఒత్తడి, అల్జీమర్స్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.
ఓరి దేవుడో.. ఇదేం ఐస్‌క్రీమ్ రా బాబు.. తల్లి పాల రుచితో ఐస్‌క్రీమ్ అంట!