ఎండాకాలంలో సగ్గుబియ్యం ప్రతి రోజు తీసుకోవడం.. వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..!
TeluguStop.com
సాధారణంగా వేసవికాలంలో ఉండే ఎండలకు డిహైడ్రేషన్ బారిన పడకుండా సగ్గుబియ్యాన్ని ఎక్కువగా ప్రజలు ఉపయోగిస్తూ ఉంటారు.
వీటిని కొన్ని ప్రాంతాలలో సాబుదానా అని కూడా అంటూ ఉంటారు.ఇవి శరీరనికి చల్లదనం ఇవ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.
ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఎప్పుడూ మన వంట గదిలో నిల్వ ఉండే వాటిలో సగ్గుబియ్యం ఒకటి.
వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.మగ వారు వీటిని తీసుకోవడం వల్ల కండరాలకు కావాల్సిన శక్తిని అందిస్తాయి.
అంతే కాకుండా మగ వారు వీటిని తీసుకోవడం వల్ల వారిలో వీర్యకణాల వృద్ధి కూడా చక్కగా పెరుగుతుంది.
ఇందులో పొటాషియం అధికంగా ఉండడం వల్ల శరీరం లోని రక్త పోటును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
అధిక బరువు తగ్గాలనుకునే వారు వారికి సగ్గుబియ్యం చాలా ఉపయోగపడుతుంది. """/" /
వీటిని రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల ఇందులోని క్యాల్షియం శరీరంలో ఎముకల గట్టిగా ఉండడానికి ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే ఎదిగే చిన్న పిల్లలలో సగ్గు బియ్యంతో చేసిన వంటకాలను చేసి పెట్టడం వల్ల వారి అరుగుదల శక్తి పెరుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.
సగ్గుబియ్యం లో ఐరన్, విటమిన్ కే ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
"""/" /
ఇంకా చెప్పాలంటే సగ్గుబియ్యం లో పోషకాలు నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి.
రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా సహాయపడి, రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి.పోషకాహారం లోపంతో బాధపడేవారు సగ్గుబియ్యం ఆహారంగా తీసుకోవడం వల్ల పోషకాహార లోపం నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సగ్గుబియ్యాన్ని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ రోజు వారి ఆహారంలో తీసుకోవడం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.
రోజు ఈ పొడిని పాలల్లో మిక్స్ చేసి తాగితే నిద్ర తన్నుకొస్తుంది..!