సపోటా తినడం వలన ఎన్ని లాభాల్లో తెలుసా…!

సపోటాను చాల మంది ఇష్టపడతారు.ఈ సపోటా బోలెడంత ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.

సహజ సిద్ధంగా లభించే ఈ పండ్లలో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి.

ఈ పండ్లలో అధికంగా ఉండే గ్లూకోజ్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.అయితే ఈ పండు తినడం వలన కలిగే ప్రయోజాలను ఒక్కసారి చూద్దమా.

మనం సపోటాను తినడం అందులో ఉండే ఫైబర్లు మలబద్దక లేకుండా చేస్తాయి.జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను సపోటా అడ్డుకుంటుందని నిపుణులు తెలిపారు.

అంతే కాకుండా సపోటాల తింటే శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్‌ లభిస్తుందన్నారు.నిద్రలేమి ఆందోళనతో బాధపడే వ్యక్తులు సపోటా తీసుకోవడం మంచిది.

జలుబు, దగ్గు సమస్యలకు కూడా సపోటా మంచి ఔషదంగా [పనిచేస్తుంది.కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్యకు సపోటాతో చెక్ పెట్టవచ్చునన్నారు.

స్థూలకాయ సమస్యకు సపోటా విరుగుడుగా పనిచేస్తుంది.సపోటాలో ఉండే విటమిన్-A వల్ల కంటికి మేలు కలుగుతుందని నిపుణులు తెలిపారు.

"""/"/ అయితే వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ నివారణకు సపోటా సహాయపడుతుంది.అంతేకాకుండా విటమిన్-B, C వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహద పడుతుంది.

సపోటాలో ఉండే కాల్షియం, ఫాస్పరస్‌ వల్ల ఎముకల గట్టిపడతాయి.అయితే సపోటాలో ఉండే పిండిపదార్థాలు గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు చాలా మేలు చేస్తాయని నిపుణులు తెలిపారు.

అంతేకాదు ఆరోగ్యానికి మేలు చేసే నియాసిన్, కాపర్, ఐరన్ వంటి మూలకాలు కూడా సపోటాలో సమృద్ధిగా దొరుకుతాయి.

సపోటా నరాల ఒత్తిడిని తగ్గించి ఉపశమనాన్ని కలిగిస్తుంది.సపోటా జ్యూస్‌ను రోజూ తీసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది.

జుట్టు రాలే సమస్యను కూడా సపోటా అరికడుతుంది.చుండ్రు సమస్యను తగ్గించడంలోనూ సపోటా బాగా పనిచేస్తుందని నిపుణులు తెలిపారు.

ఆదివారం వస్తే బాలయ్య ఆ సెంటిమెంట్ ఫాలో అవుతారా… ఆ పని అస్సలు చేయరా?