రెగ్యుల‌ర్‌గా స‌లాడ్స్‌ తింటున్నారా..? మ‌రి ఈ విష‌యాలు తెలుసా?

స‌లాడ్స్‌.ఈ మ‌ధ్య కాలంలో వీటి ట్రెండ్ బాగా న‌డుస్తోంది.

వివిధ కూర‌గాయ‌ల‌తో, పండ్ల‌తో, ఆకుకూర‌ల‌తో, మొల‌క‌ల‌తో ర‌క‌ర‌కాలుగా స‌లాడ్స్ చేసుకుని తింటుంటారు.బాగా ఆక‌లి అవుతున్న‌ప్పుడు, వంట‌ చేసుకునే ఓపిక లేన‌ప్పుడు స‌లాడ్ చేసుకోవ‌డ‌మే బెస్ట్ ఆప్ష‌న్‌.

ఎందుకంటే, ఈజీగా త‌యార‌య్యే ఆహారాల్లో స‌లాడ్స్ ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.పైగా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

అందుకే చాలా మంది త‌మ డైలీ డైట్‌లో స‌లాడ్స్ ను చేర్చుకుంటున్నారు.మ‌రి రెగ్యుల‌ర్‌గా స‌లాడ్ తీసుకోవ‌చ్చా? అంటే.

నిశ్చింతగా తీసుకోమంటున్నారు ఆరోగ్య నిపుణులు.సాధార‌ణంగా మ‌నం తీసుకునే ఆహారాల్లో దాదాపు అన్నీ ఉడికించిన‌వి, వేయించిన‌వే ఉంటాయి.

కానీ, స‌లాడ్స్‌లో వాడే వ‌న్నీ ప‌చ్చిగానే ఉంటాయి.అందు వ‌ల్లే, స‌లాడ్స్ తీసుకుంటే.

ఎక్కువ విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ మ‌రియు ఇత‌ర పోష‌కాలు ల‌భిస్తాయి.

ఇవి శ‌రీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మరియు చర్మ సౌందర్యానికి అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముఖ్యంగా ప్ర‌తి రోజు ఏదో ఒక స‌లాడ్‌ను డైట్‌లో చేర్చుకుంటే.శ‌రీరానికి బోలెడంత ఎన‌ర్జీ ల‌భిస్తుంది.

దాంతో రోజంతా మీరు చురుగ్గా, చ‌లాకీగా ఉంటారు.అలాగే రెగ్యుల‌ర్‌గా స‌లాడ్ తీసుకుంటే.

శ‌రీరానికి న్యూట్రీషియన్స్ ఎక్కువ‌గా, కేల‌రీలు త‌క్కువ‌గా అందుతాయి.దాంతో క్ర‌మంగా వెయిట్ లాస్ అవుతారు.

"""/" / రెగ్యుల‌ర్ డైట్‌లో స‌లాడ్స్ చేర్చుకుంటే.గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మల‌బద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు పుడుతుంది.అంతేకాదు, ప్ర‌తి రోజు స‌లాడ్స్ తీసుకుంటే.

షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.పోష‌కాల కొర‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.

ర‌క్త పోటు కంట్రోల్‌లో ఉంటుంది.ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగు తుంది.

మ‌రియు క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గు ముఖం ప‌డుతుంది.

అవన్నీ అవాస్తవాలే… యూట్యూబ్ ఛానల్ పై మండిపడిన రేణు దేశాయ్!