చలికాలంలో పచ్చికొబ్బరి కచ్చితంగా తినాలి.. ఎందుకంటే?

చలికాలంలో ఆరోగ్యానికి అండగా నిలిచే ఆహారాల్లో పచ్చి కొబ్బరి( Raw Coconut ) ఒకటి.

ప్రస్తుత సీజన్ లో పచ్చి కొబ్బరిని కచ్చితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు.వింట‌ర్ లో పచ్చికొబ్బరి ఎందుకు తినాలి.

? అది అందించే ఆరోగ్యం ప్రయోజనాలు ఏంటి.; అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చి కొబ్బరి ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కొందరు పచ్చి కొబ్బరి తో చాలా రకాల వంటలు తయారు చేస్తుంటారు.

పచ్చి కొబ్బరిలో పోషకాలు మెండుగా ఉంటాయి.విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ తో సహా అనేక పోషకాలను పచ్చి కొబ్బరి ద్వారా పొందవచ్చు.

ముఖ్యంగా ప్రస్తుతానికి చలికాలంలో పచ్చి కొబ్బరి నేరుగా తీసుకుంటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

పచ్చి కొబ్బరి ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.తగిన మోతాదులో నిత్యం పచ్చి కొబ్బరిని తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

జలుబు ,దగ్గు వంటి సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటాయి.అలాగే పచ్చి కొబ్బరి కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.

గుండె ఆరోగ్యానికి( Heart Health ) అండగా నిలుస్తుంది. """/" / చలికాలంలో సహజంగానే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.

దీని కారణంగా గ్యాస్, కడుపు ఉబ్బరం( Gas Bloating ), అజీర్తి, మలబద్ధకం వంటివి అధికంగా వేధిస్తుంటాయి.

అయితే పచ్చికొబ్బరి ఆయా సమస్యలకు చెక్ పెడుతుంది.నిత్యం పచ్చి కొబ్బరిని తీసుకుంటే అందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పనితీరును పెంచుతుంది.

జీర్ణ సంబంధిత సమస్యలకు అడ్డుకట్ట వేస్తుంది. """/" / అలాగే చలికాలంలో పచ్చి కొబ్బరి బెల్లం కలిపి తీసుకుంటే శరీరానికి వెచ్చదనం లభిస్తుంది.

చలిని తట్టుకునే సామర్థ్యం అందుతుంది.అంతేకాదు ఈ చలికాలంలో హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది అధికంగా ఉంటుంది.

అలాగే చర్మం పొడిబారిపోయి చికాకుకు గురి చేస్తుంది.అయితే ప‌చ్చి కొబ్బ‌రిని తీసుకుంటే ఆ రెండు సమస్యలను వదిలించుకోవచ్చు.

పచ్చికొబ్బరి లో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.

అదే స‌మ‌యంలో చ‌ర్మాన్ని సహజంగానే తేమగా కోమలంగా మారుస్తాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 7, బుధవారం 2024