పల్లి, బెల్లం కలిపి తీసుకుంటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

శరీరం ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం.ముఖ్యంగా శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు తీసుకోవడం చాలా అవసరం.

అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వలన శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వేరుశనగలు,( Peanuts ) బెల్లం( Jaggery ) లాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు దొరుకుతాయని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా ఇందులో అధిక శాతం మంచి కొవ్వు కూడా లభిస్తుంది.ఆరోగ్య నిపుణుల ప్రకారం పల్లెలో ప్రోటీన్ శాతం గుడ్లలో, మాంసంలో కన్నా ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచి కలిగిస్తుంది. """/" / వాటిని లడ్డూలుగా చేసి తినవచ్చు.

అంతేకాకుండా వేయించిన పల్లీలు, బెల్లం, మేకపాలతో కలిపి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి( Immunity Power ) పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా తరచూ మహిళలు నెలసరి సమయంలో( Periods ) కడుపునొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు.

అలాంటివారు పల్లీలు నానబెట్టి, బెల్లంతో కలిపి తీసుకుంటే ఐరన్ లభిస్తుంది.దీని వలన శరీరానికి శక్తి కూడా లభిస్తుంది.

ఈ విధంగా పల్లీలు తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.అయితే పల్లీలు బెల్లం కలిపి లడ్డూలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / వేరుశనగలను దోరగా వేయించుకోవాలి.మంచి రంగు వచ్చినంత వరకు వేయించిన పల్లీలను పక్కకు పెట్టుకోవాలి.

ఆ తర్వాత బెల్లం గిన్నెలో కరిగించి పెట్టుకోవాలి.మిక్సీ జార్ లో వేయించిన పల్లీలు కావలసిన డ్రైఫ్రూట్స్( Dry Fruits ) వేసుకొని మిక్సీ పట్టాలి.

మిక్సీ పట్టిన ఆ పల్లీల పేస్టుని కరిగించి పెట్టుకున్న బెల్లం పాకంలో వేసి బాగా కలిపి లడ్డూల లాగా తయారు చేసుకుని పెట్టుకోవాలి.

ఆ తర్వాత రోజు ఒకటి లేదా రెండు లడ్డూలు తినడం వలన మంచి శక్తి లభిస్తుంది.

అంతేకాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు కూడా వీటిని తీసుకోవడం వలన మోకాళ్లలో గుజ్జు ఏర్పడి మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు లో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఇద్దరు దర్శకులు వీళ్లేనా..?