ప‌ర‌గ‌డుపున‌ రెండంటే రెండు వేప పండ్ల‌ను తింటే ఆ జ‌బ్బులు దూరం!

వేప.ప్ర‌కృతి ప్ర‌సాధించిన అద్భుత‌మైన చెట్ల‌లో ఇదీ ఒక‌టి.

వేప నుంచి వ‌చ్చే ఆకులు, పండ్లు, వేర్లు, బెరడు ఇలా అన్నీ మ‌న‌కు ఏదో ఒక విధంగా ఉప‌యోగ‌ప‌డుతూనే ఉంటాయి.

ముఖ్యంగా వేప పండ్ల విష‌యానికి వ‌స్తే.ఇవి చేదుగానే ఉంటాయి.

కానీ, ఎన్నో ఔషధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా వేప పండ్లు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

అందులోనూ ప్ర‌తి రోజూ ప‌ర‌గ‌డుపున రెండంటే రెండు వేప పండ్ల‌ను తింటే గ‌నుక మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.

మ‌రి ఆ బెనిఫిట్స్ ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఓ చూపు చూసేయండి.మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల‌కు వేప పండ్లు ఓ వ‌ర‌మే అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

ఎందు కంటే, ఉద‌యాన్నే ఖాళీ క‌డుపున రెండు వేప పండ్ల‌ను తీసుకుని శుభ్రంగా నీటిలో క‌డిగి బాగా న‌మిలి తినాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.అలాగే వేప పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల.

శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లి పోతాయి. """/" / ప్ర‌తి రోజు వేప పండ్ల‌ను తింటే గ‌నుక మూత్రాశయ ఇన్ఫెక్ష‌న్ మ‌రియు ఇత‌ర మూత్రాశయ స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

పైల్స్ వ్యాధితో ఇబ్బంది ప‌డే వారు రోజూ ఉద‌యంతో పాటు సాయంత్రం కూడా రెండు చ‌ప్పున వేప పండ్ల‌ను న‌మిలి తినాలి.

త‌ద్వారా పైల్స్ వ్యాధి నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌తారు.ఇక వేప పండ్ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపున తిన‌డం వ‌ల్ల‌.

అందులోని యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌ను స్ట్రాంగ్ గా మార్చి వైర‌స్‌లు, ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు ద‌రి దాపుల్లోకి రాకుండా ర‌క్షిస్తుంది.

అదే స‌మ‌యంలో శ‌రీరంలోని కొవ్వు ను క‌రిగించి బ‌రువును అదుపులోకి తెస్తుంది.క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

మ‌రియు క‌డుపులో నులి పురుగులు ఏమైనా ఉంటే నాశ‌నం అవుతాయి.

చంద్రబాబు పేరున ఒక డ్రీమ్ లేదు.. స్కీమ్ లేదు..: మంత్రి బొత్స