పరగడుపున పుదీనా ఆకులు నమిలి తింటే ఆ జబ్బులు పరారవ్వాల్సిందే!
TeluguStop.com
అద్భుతమైన ఆకుకూరల్లో పుదీనా ఒకటి.ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉండే పుదీనాలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు సైతం మెండుగానే ఉంటాయి.
అందుకే పుదీనా ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలను అందిస్తుంది.అయితే పుదీనాను తీసుకునే విధానాన్ని బట్టీ కూడా దాని ప్రయోజనాలు ఆధార పడి ఉంటాయి.
ముఖ్యంగా మిగిలిన సమయాలతో పోలిస్తే పరగడుపున పుదీనాను తినడం చాలా మేలంటున్నారు నిపుణులు.
"""/"/
అవును, ఉదయాన్నే ఖాళీ కడుపుతో నాలుగంటే నాలుగు పుదీనా ఆకులను బాగా నమిలి మింగాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే అనేక జబ్బులకు దూరంగా ఉండొచ్చు.మరి లేటెందుకు పుదీనాను పరగడుపున తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూసేయండి.
ఈ మధ్య కాలంలో చిన్న వయసు వారిలో సైతం మతిమరుపు కామన్‌గా కనిపిస్తోంది.
అయితే ఉదయాన్నే బ్రెష్ అనంతరం నాలుగు పుదీనా ఆకులను తింటే మెదడు చురుగ్గా మారుతుంది.
దాంతో మతిమరుపు దూరమై జ్ఞాపక శక్తి పెరుగుతుంది.అలాగే పరగడుపున పుదీనా ఆకులను నమిలి తినడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటివి మానసిక జబ్బులు పరారై మనసు ప్రశాంతగా మారుతుంది.
చాలా మంది నోటి దుర్వాసనతో తెగ ఇబ్బంది పడుతుంటారు.అయితే రోజూ ఉదయాన్నే పుదీనా ఆకులను తింటే క్రమంగా నోటి దుర్వాసన సమస్య తగ్గిపోతుంది.
అదే సమయంలో దంతాలు, చిగుళ్లు సైతం ఆరోగ్యంగా మారతాయి. """/"/
పిల్లలు, పెద్దలు అనే తేడా చాలా మంది మార్నింగ్ సిక్ నెస్ తో నానా తిప్పలు పడతాయి.
అయితే రెగ్యలుర్‌గా పరగడుపున నాలుగు పుదీనా ఆకులు నమిలి తింటే వికారం, వాంతులు, తల తిరగడం వంటివి దరి చేరకుండా ఉంటాయి.
దాంతో మీ ఉదయం ఫ్రెష్‌గా ఉంటుంది.ఇక ఉదయాన్నే పుదీనా ఆకులు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ సైతం సూపర్‌గా పెరుగుతుంది.
ఆ విషయంలో వేరే వాళ్ళపై ఆధారపడడం, నమ్మడం నాకు ఇష్టం లేదు: ఉపాసన