ఆడవాళ్లు తప్పనిసరిగా ఆ ఆకుకూరలు ఎందుకో తినాలో తెలుసా..?!

ఆడవాళ్లు తమ ఆహారంలో భాగంగా ఆకుకూరలను తప్పకుండా తీసుకుంటూ ఉండాలి.మరి ముఖ్యంగా తోటకూర, గోంగూరలను నిత్యం తింటూ ఉండాలి.

ఎందుకంటే ఈ రెండు రకాల ఆకుకూరల్లో లవణాలు చాలా ఎక్కువ మొత్తంలో లభ్యం అవుతాయి.

ముఖ్యంగా తోటకూర తినడం వలన అతిమూత్ర వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.అలాగే మహిళలకు ప్రతి నెల నెలసరి రావడం అనేది ప్రకృతి ధర్మం.

ఇలా నెలసరి సమయంలో రక్తస్రావం అవ్వడం వలన ఆడవాళ్లు చాలా నిరసించిపోతారు.అలాంటి పరిస్థితిని అధిగమించాలంటే స్త్రీకు నిత్యం తమ ఆహారంలో తోటకూరను తీసుకుంటూ ఉండాలి.

ఈ ఆకుకూరలు తనడం వలన బహిష్టు రోజులలో కలిగే అధిక రక్తస్రావాన్ని తగ్గిస్తుంది.

అలాగే స్త్రీలలో కలిగే నెలసరి సమస్యలను కూడా క్రమబద్ధం చేస్తుంది.ఇకపోతే గోంగూర విషయానికి వస్తే.

దాని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎందుకంటే గోంగూర తినడానికి ఎంత రుచికరంగా ఉంటుందో, ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

గోంగూర ఆకులు శరీర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి.గొంగూరలో చాలా రకాల ఖనిజాలు ఉన్నాయి.

గోంగూర ఆకులు, పువ్వులు తినడం వలన శరీరంలోని వేడిని తగ్గించి చల్లబరుస్తాయి.అలాగే గోంగూరలో ఉండే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఆడవాళ్ళ ఎముకలను బలంగా చేయడంలో సహాయపడతాయి.

ఇవే కాకుండా గోంగూరలో ఐరన్, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, జింక్, విటమిన్ A కూడా పుష్కలంగా ఉంటాయి.

"""/"/ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గోంగూర ఆకులలో ఆక్సాలిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది.

ఇది కాల్షియంతో బంధించి కాల్షియం ఆక్సలేట్‌ను ఏర్పరుస్తుంది.ఫలితంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

కావున ప్రతిరోజు ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిది అని అన్నాం కదా అని గోంగూరను ప్రతిరోజూ తినడం కూడా మంచిది కాదు.

వారంలో రెండుసార్లు లేదంటే మూడు సార్లు తీసుకుంటే చాలు.

ఒకటి ముద్దు రెండు వద్దు… సీక్వెన్స్ ల పేరుతో ఫాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవద్దు