ఉదయాన్నే నెయ్యి తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?

నెయ్యి.ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అందుకే చాలా మంది నెయ్యిని ఎంతో ఇష్టంగా తీసుకుంటారు.అయితే కొంద‌రు మాత్రం బ‌రువు పెరిగిపోతారేమో అన్న భ‌యంతో నెయ్యికి దూరంగా ఉంటారు.

కానీ, అదే మీరు చేసే పొర‌పాటు.నెయ్యి మితంగా తీసుకుంటే.

అందులో ఉండే మంచి కొలెస్ట్రాల్ బ‌రువు త‌గ్గేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.ఇక ఉద‌యాన్నే.

నెయ్యి తీసుకుంటే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు పొందొచ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మ‌రి ఆ ప్ర‌యోజ‌నాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్ర‌తి రోజు ఉద‌యాన్నే టీ, కాఫీలు కాకుండా.ఒక‌టి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తాగితే.

జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.ముఖ్యంగా మ‌లబద్ధకం, గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు ఉన్న వారు ఉద‌యాన్నే నెయ్యి తీసుకుంటే.

మంచి ఫ‌లితం ఉంటుంది.అలాగే పరగడుపున వేడినీటిలో నెయ్యిని కలిపి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంది.

మ‌రియు ఇలా వేడి నీటిలో నెయ్యిని మిక్స్ చేసుకోవ‌డం వ‌ల్ల ఆలోచించే శ‌క్తి అంటే జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది.

విట‌మిన్- ఏ పుష్క‌లంగా ఉండే నెయ్యిని ప్ర‌తి రోజు క్ర‌మం త‌ప్ప‌కుండా ఒక‌టి లేదా రెండు స్పూన్లు ఉద‌యాన్నే తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల‌ కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.అలాగే సూర్య ర‌శ్మి నుంచి వ‌చ్చే విట‌మిన్- డి కూడా నెయ్యి ద్వారా పొందొచ్చు.

అందుకే ఉద‌యాన్నే నెయ్యి తీసుకోవ‌డం వ‌ల్ల‌.ఇందులో ఉండే విట‌మిన్- డి ఎముకల‌ను, దంతాల‌ను దృఢంగా మారుస్తాయి.

ఇక చాలా మంది త‌మ చ‌ర్మం మృదువుగా, అందంగా లేద‌ని బాధ‌ప‌డ‌తారు.అలాంటి వారు ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటే.

చ‌ర్మం సున్నితంగా, ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.అదే స‌మ‌యంలో చ‌ర్మంపై ఉన్న ముడ‌త‌లు కూడా త‌గ్గుతాయి.

అలాగే ప్రెగ్నెంట్‌గా ఉన్న మ‌హిళ‌లు ఉద‌యాన్నే నెయ్యి తీసుకుంటే.క‌డుపులో ఉన్న బిడ్డ‌కు అన్ని పోష‌కాలు అంది.

చ‌క్క‌గా ఎదుగుతుంది.

50 రోజుల్లో 11 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం.. పవర్ స్టార్ పవన్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!