ఆరోగ్యానికి యాలకులు ఎలా పనిచేస్తాయంటే…?!
TeluguStop.com
మనం వంటల్లో వాడే సుగంధ ద్రవ్యాల్లో చాలా ముఖ్యమైనవి యాలకలు.మన ఇంట్లో వండే పలు రకాల్లో స్వీట్లలో వీటిని ఉపయోగిస్తుంటాం.
అన్ని వంటకాలకు ఇవి మంచి సువాసనను, రుచిని అందిస్తాయి.చూడడానికి యాలకులు చాలా చిన్నగా కనిపిస్తాయి.
కానీ వీటి ఖరీదు మాత్రం చాలా ఎక్కువ.సుగంద ద్రవ్యాల్లో ఇవే ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ఎదో మనం వంటల్లో రుచికోసం మాత్రమే యాలకులు వాడుతున్నాం అనుకుంటే పొరపాటే ఈ యాలకులకు ఎన్నో విశేష ఔషధగుణాలున్నాయి.
ఈ యాలకుల ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఆరోగ్యానికి, అందానికి, రుచికి చాలా ఉపయోగపడతాయి.
యాలకులు మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే షాక్ అవుతారు.యాలకులు మనకు ఎలా ఉపయోగపడతాయో ఒకసారి తెలుసుకుందాం.
!! యాలకుల గింజలు నోటితో నములుతుండటం వల్ల క్రిములు నశించడమే కాకుండా, నోటి దుర్వాసనను కూడా అరికడుతుంది.
దంతాలను, చిగుళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.అలాగే ప్రతిరోజూ యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి మెడిసిన్ తో అవసరం ఉండదు.
ఎలాంటి రోగం అయినా గాని మన దరి చేరదు. """/"/
ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రధాన సమస్య బరువు పెరగడం.
అయితే చాలా సింపుల్ గా బరువును తగ్గించుకోవాలనుకునే వారు ప్రతి రోజూ రాత్రి ఒక యాలుకను తిని, ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది.
ఇలా చేయడం ద్వారా మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.ఇలా తాగడం వల్ల శరీరం లో హానికరమైన మలినాలు, చెడు పదార్దాలు తొలగిపోయి రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
అంతేకాదు ఇలా చేయడం వల్ల నిద్రలేమీ సమస్య తొలగిపోయి హాయిగా నిద్రలోకి జారుకుంటారు.
అలాగే నిద్రలో గురక శబ్ధం చేసేవారు కూడా ప్రతిరోజూ రాత్రి ఒక యాలుకను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల ఒక మెడిసిన్ లా పని చేసి నిధానంగా నిద్రలో గురక తగ్గుతుంది.
అలాగే యాలకుల కషాయం తాగితే దగ్గు నుంచి మంచి ఉపశమనం ఉంటుంది.
10 నిమిషాల ప్రయాణానికి రూ. 2800 ఛార్జ్ .. ఎన్ఆర్ఐ ఫిర్యాదుతో వెలుగులోకి , ట్యాక్సీవాలా అరెస్ట్