ఖాళీ కడుపుతో కరివేపాకు తినండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి!
TeluguStop.com
కరివేపాకు( Curry Leaves ) గురించి పరిచయాలు అక్కర్లేదు.దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి నిత్యం కరివేపాకును విరివిరిగా వాడుతుంటారు.
కరివేపాకులో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.ఆరోగ్య పరంగా కరివేపాకు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.
కూరల్లోనే కాకుండా కరివేపాకును నేరుగా కూడా తినొచ్చు.ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో ఐదారు కరివేపాకు ఆకులు నమిలి తింటే మస్తు ఆరోగ్య లాభాలు మీసొంతం అవుతాయి.
డయాబెటిస్( Diabetes ) ఉన్నవారికి కరివేపాకు వరం అని చెప్పవచ్చు.రోజు ఖాళీ కడుపుతో కరివేపాకును నమిలి తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఇటీవల రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో కంటి చూపు మందగిస్తుంది.
కొందరిలో విటమిన్ ఎ లోపం ఇందుకు ప్రధాన కారణం కావొచ్చు.అయితే విటమిన్ ఎ కొరతను పూడ్చి కంటి చూపును( Eye Sight ) పెంచడంలో కరివేపాకు ఉత్తమంగా హెల్ప్ చేస్తుంది.
రోజు ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే కళ్ళద్దాలపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు.
"""/" /
ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల రక్తంలో ఉన్న విషపదార్థాలను తొలగిపోతాయి.
రక్తశుద్ధి జరుగుతుంది.కరివేపాకులో ఐరన్ అధిక మొత్తంలో ఉంటుంది.
అందువల్ల కరివేపాకు రక్తహీనతను తగ్గించడంలో తోడ్పడతుంది.కరివేపాకులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. """/" /
హెయిర్ ఫాల్ ఎందరినో కామన్ గా వేధించే సమస్య.
అయితే హెయిర్ ఫాల్ సమస్యను నివారించడానికి కరివేపాకు చక్కగా ఉపయోగపడుతుంది.రోజు ఉదయం కరివేపాకు తింటే జుట్టుకు మంచి పోషణ అందుతుంది.
హెయిర్ రూట్స్ స్ట్రోంగ్ గా మారి.జుట్టు ఊడటం, విరగడం తగ్గుతాయి.
అంతేకాకుండా ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే స్కిన్ కూడా హెల్తీగా మారుతుంది.