రోజూ 2 ల‌వంగాల‌ను ఇలా తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండ‌దు!

లవంగాలు(cloves) చూడడానికి చిన్న పరిమాణంలో కనిపించిన చాలా ఘాటుగా ఉంటాయి.మన ఇండియన్ స్పైసెస్ లో లవంగాలు ముఖ్యమైనవి.

వంటలకే కాకుండా ఆయుర్వేదంలోనూ లవంగాలు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి.అటువంటి లవంగాలను రోజుకు రెండు చొప్పున తేనెలో ముంచి తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు.

అవును, ఉదయం ఖాళీ కడుపుతో రెండు లవంగాలను(Two Cloves) తీసుకుని తేనెలో(honey) ముంచి తినాలి.

ఆపై ఒక గ్లాస్ గోరువెచ్చని వాట‌ర్(Warm Water) ను తీసుకోవాలి.నిత్యం ఈ విధంగా చేశారంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.

లవంగాలు ఉష్ణత్వాన్ని కలిగించే గుణం కలిగి ఉంటాయి.వాటిని తేనెతో కలిపి తింటే దగ్గు, గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు ప‌రార్ అవుతాయి.

లవంగం మ‌రియు తేనె కాంబినేష‌న్ కాలేయ‌ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది.

తేనెలో ముంచిన ల‌వంగాల‌ను ప్ర‌తి రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల‌ శరీర రోగ నిరోధకశక్తి బలోపేతం అవుతంది.

దాని ఫ‌లితంగా వైర‌ల్ అండ్ బ్యాక్టీరియ‌ల్ ఇన్ఫెక్ష‌న్స్ నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. """/" / లవంగం మ‌రియు తేనెలో ఉండే శ‌క్తివంత‌మైన‌ యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటి నుండి వ‌చ్చే బ్యాడ్ బ్రీత్ (Bad Breath Coming From The Mouth)ను కంట్రోల్ చేస్తాయి.

దంతాల పోటు, చిగుళ్ల వాపు వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిండ‌చంలోనూ తోడ్ప‌డ‌తాయి.ల‌వంగం మ‌రియు తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.

ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.మొటిమలతో స‌హా ఇత‌ర‌ చర్మ స‌మ‌స్య‌ల నుంచి ఉపశమనం క‌ల్పిస్తాయి.

అంతేకాదండోయ్‌.నిత్యం ఉద‌యం ఖాళీ క‌డుపుతో రెండు ల‌వంగాల‌ను తేనెలో ముంచి తింటే జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.

గ్యాస్, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటివి ద‌రిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అయితే ఆరోగ్యానికి మంచిద‌ని ల‌వంగాల‌ను అధికంగా తీసుకుంటే ఆమ్లత, శరీర ఉష్ణత ఎక్కువవడం వంటి సమస్యలు రావొచ్చు.

కాబ‌ట్టి ప్రతిరోజూ తక్కువ పరిమితిలో అంటే ఒక‌టి లేదా రెండు మాత్రమే తీసుకోండి.