వారంలో రెండే రెండు సార్లు ఈ జ్యూస్ తాగితే మీ ఆరోగ్యం ప‌దిలం!

పొట్ల‌కాయ‌.ఈ పేరు వింట‌నే కొంద‌రు ఫేస్ అదోలా పెట్టేస్తారు.

ముఖ్యంగా పిల్ల‌లైతే పొట్ల‌కాయ తిన‌డానికి అస్స‌లు ఇష్ట ప‌డ‌రు.కానీ, పొట్ల‌కాయ‌లో ఎన్నో అమోఘ‌మైన పోష‌కాలు దాగి ఉన్నాయి.

అందుకే ఆరోగ్యానికి పొట్ల‌కాయ ఎంతో మేలు చేస్తుంది.అయితే పొట్ల‌కాయ తిన లేని వారు జ్యూస్ త‌యారు చేసుకుని తాగొచ్చు.

నిజానికి పొట్లకాయను నేరుగా కంటే జ్యూస్‌లా త‌యారు చేసుకుని వారంలో రెండంటే రెండు సార్లు తీసుకుంటే ఆరోగ్యాన్ని ప‌దిలంగా కాపాడుకోవ‌చ్చు.

"""/"/ ముఖ్యంగా పొట్ల‌కాయ జ్యూస్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల‌.అందులో ఉండే ఐర‌న్ కంటెంట్ ర‌క్త హీన‌త బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది.

అదే స‌మ‌యంలో నీర‌సం, అల‌స‌ట‌, వంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.అలాగే నిద్ర లేమితో బాధ ప‌డే వారికి పొట్ల‌కాయ జ్యూస్ ఆప్ష‌న్‌గా చెప్పుకోవ‌చ్చు.

వారంలో రెండు సార్లు పొట్ల‌కాయతో జ్యూస్ చేసుకుని సేవిస్తే.మంచిగా నిద్ర ప‌డుతుంది.

ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.ఇటీవ‌ల రోజుల్లో బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న వారు ఎంద‌రో ఉన్నారు.

అయితే అలాంటి వారు త‌ర‌చూ పొట్లకాయ జ్యూస్‌ను తీసుకుంటే.శ‌రీరంలో కొవ్వంతా క‌రిగిపోయి వేగంగా వెయిట్ లాస్ అవుతాయి.

వారానికి రెండు సార్లు పొట్ల‌కాయ జ్యూస్ సేవిస్తే.యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరానికి సమృద్ధిగా అందుతాయి.

త‌ద్వారా కీళ్ల నొప్పులు, కండ‌రాల వాపులు త‌గ్గుతాయి.హైబీపీ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

గుండె ఆరోగ్యంగా మారుతుంది. """/"/ అంతేకాదు, మ‌ధుమేమం రోగులు పొట్ల‌కాయ జ్యూస్ సేవిస్తే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

హెయిర్ ఫాల్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ సైతం చురుగ్గా మారుతుంది.

ఇక చివ‌రిగా గుర్తించుకోవాల్సిన విష‌యం ఏంటంటే.పొట్ల‌కాయ జ్యూస్‌ను వారికి రెండు లేదా మూడు సార్ల‌కు మించి తీసుకోరాదు.

లిఫ్ట్‌లో అమ్మాయిని పడేసి కొట్టేస్తున్న వ్యక్తి.. దేవుడిలా వచ్చి కాపాడిన గార్డ్..?