చలి కాలంలో ఆరెంజ్ జ్యూస్ తాగితే ఆ సమస్యలన్నీ పరార్?
TeluguStop.com
చలి కాలం ప్రారంభం అయిపోయింది.ఈ కాలంలో చలే కాదు.
రోగాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.గాలిలో తేమ ఎక్కువ అవ్వడం వల్ల ఈ సీజన్ లో చాలా మంది జబ్బుల బారిన పడుతుంటారు.
అందుకే మిగిలిన సీజన్స్‌తో పోలిస్తే.ఈ చలి కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ సారించాల్సి ఉంటుంది.
అయితే ఈ చలి కాలంలో రోజుకో గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆరెంజ్ జ్యూస్ ప్రతి రోజు తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఫలితంగా రకరకాల వైరస్‌లు, జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది.అదే సమయంలో ఈ సీజన్‌లో కామన్‌గా వచ్చే జలుబు మరియు ఫ్లూ సమస్యలను దూరం చేస్తుంది.
అధిక బరువు తగ్గాలనుకునే వారు ఆరెంజ్ జ్యూస్‌ను రెగ్యులర్ గా తీసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే.ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అధిక బరువును నియంత్రణలోకి తీసుకువస్తాయి.
అలాగే ఆరెంజ్ జ్యూస్ రెగ్యులర్‌గా తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.
మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.ఫలితం గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది.
మరియు అధిక రక్త పోటు కూడా కంట్రోల్‌లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.చాలా మంది అనీమియా లేదా రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు.
అలాంటి వారు ప్రతి రోజు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల.ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచే రక్త హీనతను దూరం చేస్తుంది.
అలాగే ఆరెంజ్ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అందులో ఉండే హెస్పరిడిన్ శరీరంలోని క్యాన్యర్ కణాలతో పోరాడి.
వాటిని నాశనం చేస్తుంది.ఇక ఆరెంజ్ జ్యూస్‌లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది.
కాబట్టి, ప్రెగ్నెన్సీ మహిళలు ప్రతి రోజు ఆరెంజ్ జ్యూస్ తాగితే.పిండం ఎదుగుదలకు సహాయపడుతుంది.
ధర్మశాల అందాలకు ముగ్ధుడైన జర్మన్.. ‘ప్రతి క్షణం నచ్చింది’ అంటూ..?