మానసిక శారీరక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఈ గడ్డి కషాయాన్ని తాగడం మంచిదా..
TeluguStop.com
ఈ భూమి మీద ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి.ఇందులో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్న గడ్డి జాతి మొక్కల్లో లెమన్ గ్రాస్ ఎంతో ముఖ్యమైనది.
ఇందులో మన ఆరోగ్యాన్ని రక్షించే ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
లెమన్ గ్రాస్ లో సహజ యాంటీ ఆక్సిడెంట్లు, ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వ్యాధికారకాలను తొలగించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
లెమన్ గ్రాస్ నుంచి తీసిన ఆయిల్ ఎన్నో రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
లెమన్ గ్రాస్ తో తయారు చేసిన టీ ని ప్రతిరోజు త్రాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
లెమన్ గ్రాస్ లో మన శరీరానికి అవసరమైన మెగ్నీషియం, విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా లభిస్తాయి.
అంతే కాకుండా ఈ లెమన్ గ్రాస్ లో తయారు చేసిన టీ నీ ప్రతిరోజు త్రాగడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను నియంత్రించి శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
అంతే కాకుండా ఇందులో ఉండే బయోటిన్ గుణాలు సీజనల్గా వచ్చే అనేక రకాల అలర్జీల నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి.
లెమన్ గ్రాస్ లో లభించే యాంటీ క్యాన్సర్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయి.
"""/"/
అంతేకాకుండా శరీరంలోని అవయవాల ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి.అంతే కాకుండా రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి.
ఇందులో సమృద్ధిగా లభించే ఐరన్ రక్తకణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనత సమస్యను కూడా దూరం చేస్తుంది.
తలనొప్పి, తుమ్ములు, గొంతు నొప్పి వంటి చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు లెమన్ టీ నీ సేవిస్తే వెంటనే ఉపశమనం లభించే అవకాశం ఉంది.
అంతేకాకుండా నరాల ఉత్తేజాన్ని పెంచి కీళ్ల నొప్పుల సమస్యను కూడా ఈ లెమన్ గ్రాస్ తగ్గిస్తుంది.
ఇంకా చెప్పాలంటే ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్లను తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది.
డొనాల్డ్ ట్రంప్ నియామకాన్ని సమర్ధించిన రో ఖన్నా .. శ్రీరామ్ కృష్ణన్‌కు మద్ధతు