రోజుకో కప్పు ఐస్ టీ తాగితే.. ఎన్ని హెల్త్ బెనిఫిట్సో తెలుసా?
TeluguStop.com
నేటి ఆధునిక కాలంలో చాలా మందికి ఉదయం లేవగానే వేడి వేడిగా ఓ కప్పు టీ తాగే అలవాటు ఉంటుంది.
అలాగే కాస్త తలనొప్పిగా అనిపించినా, తల తిరిగినట్టు ఉన్నా, ఒత్తిడిగా ఉన్నా, బద్దకం నుంచి బయట పడాలనుకున్నా చాలా మంది టీనే ఎంచుకుంటారు.
టీ తాగడం వల్ల మంచి ఉత్తేజాన్ని పొందుతారు.ఇక రోజుకు ఒకటి, రెండు కప్పులు మించ కుండా టీని తీసుకుంటే.
ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు.అయితే వేడి వేడి టీ కంటే ఐస్ టీ ఆరోగ్యానికి ఇంకా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఐస్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని మలినాలను, వ్యర్ధాలను బయటకు పంపుతాయి.
దాంతో మీ చర్మం యవ్వనంగా, కాంతివంతంగా ఉంటుంది.అలాగే ప్రస్తుతం సమ్మర్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ సీజన్‌లో చాలా మంది డీహైడ్రేషన్‌కు గరవుతుంటారు.అయితే రోజుకో కప్పు ఐస్ టీ తాగితే.
శరీరంలో హైడ్రేటెడ్‌గా ఉంటుంది.వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నించే వారు.
రెగ్యులర్‌గా ఐస్ టీ తీసుకోవడం మంచిది.ఐస్ టీ తీసుకుంటే శరీరంలో కొవ్వు కరుగుతుంది.
దాంతో బరువ తగ్గుతారు.అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడే పోషకాలు ఐస్ టీలో ఉంటాయి.
అందువల్ల ఐస్ టీని తీసుకుంటే.క్యాన్సర్ వ్యాధికి దూరంగా ఉండొచ్చు.
"""/" /
ఐస్ టీ తీసుకోవడం వల్ల గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
దంతాల్ని పాడు చేసే కేవిటీస్‌ను నాశనం చేయడంలో ఐస్ టీ అద్భుతంగా సహాయపడుతుంది.
కాబట్టి, రోజుకో కప్పు ఐస్ టీని తీసుకుంటే దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఇక ఐస్ టీ తీసుకుంటే ఒత్తిడి, డిప్రెషన్, తలనొప్పి వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
టాలెంట్ ఉన్నప్పుడు బలుపు ఉన్నా తప్పులేదు… బన్నీకి మద్దతు తెలిపిన నటి!