కొబ్బరి నీళ్లు,తేనే కలిపి త్రాగితే ఏమవుతుందో తెలుసా?

కొబ్బరినీటిలో ఎన్ని ఆరోగ్య ప్రయాణాలు ఉన్నాయో మనకు తెలిసిన విషయమే.మన శరీరానికి అవసరమైన మినరల్స్, పోషకాలను అందిస్తుంది.

ఒక రకంగా చెప్పాలంటే శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.ఇక తేనే విషయానికి వస్తే తేనెలో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి.

అంతేకాక స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్ కార‌కంగా పనిచేస్తుంది.ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక గ్లాస్ కొబ్బరినీటిలో ఒక స్పూన్ తేనే కలిపి త్రాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ఇప్పుడు వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.కొబ్బరి నీరు, తేనే మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ సమృద్ధిగా ఉండుట వలన యాంటీ ఏజింగ్ కారకంగా పనిచేసి వృద్ధాప్య లక్షణాలు తొందరగా రాకుండా చేస్తుంది.

వయస్సు కారణంగా వచ్చే ముడతలు కూడా తొలగిపోతాయి.ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు క్రమం తప్పకుండా త్రాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడి గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం, అల్సర్ వంటివి రావు.

కొబ్బరినీరు, తేనే మిశ్రమంలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉండుట వలన క‌డుపులో ఉండే సూక్ష్మ క్రిముల‌ను చంపి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

"""/"/ ఇది అధిక బరువు ఉన్న వారికీ దివ్య ఔషధం అని చెప్పవచ్చు.

ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా త్రాగితే చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది.

దాంతో బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అలాగే రోగనిరోధక శక్తిని పెంచటంలో కూడా సహాయపడతాయి.

కిడ్నీలు శుభ్ర‌మ‌వుతాయి.వాటిలో ఉండే వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి.

కిడ్నీలు క్లీన్ అవుతాయి.

కువైట్‌‌కు అండగా నిలుస్తాం .. ప్రవాస భారతీయులతో నరేంద్ర మోడీ