రోజుకో కప్పు యాపిల్ టీ తాగితే..బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరుగుతుందట?!
TeluguStop.com
యాపిల్ ఆరోగ్యానికి మంచిదనీ, ఎన్నో జబ్బులను నివారిస్తుందనీ అందరికీ తెలుసు.చూసేందుకు ఎర్రగా నిగనిగలాడుతూ ఉండే యాపిల్ పండ్ల ధర ఎక్కువై.
అయినప్పటికీ విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇలా ఆరోగ్యానికి మేలు చేసే బోలెడన్ని పోషకాలు కూడా నిండి ఉంటాయి.
అందుకే ధర ఎంతైనా ఆరోగ్యం కోసం వీటిని కొనుగోలు చేస్తుంటారు. """/"/
అయితే యాపిల్ ఒకటే కాకుండా.
యాపిల్ టీ కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.మరి యాపిల్ టీని ఎలా తయారు చేసుకోవాలి.
? అసలు యాపిల్ టీ తాగడం వల్ల వచ్చే లాభాలు ఏంటీ.? అన్న విషయాలు లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా పాత్రలో ఒకటిన్నర గ్లాస్ నీరు పోసి.అందులో కొన్ని యాపిల్ ముక్కలు వేసి కాసేపు హీట్ చేయాలి.
ఆ తర్వాత అందులో ఒక స్పూన్ టీ పొడి, చిన్న అల్లం ముక్క, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి మరిగించి వడబోసుకోవాలి.
అనంతరం ఇందులో తేనె కలిపి సేవించాలి.ఈ మధ్యంలో చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో నానా తిప్పలు పడుతున్నారు.
అలాంటి వారు ఈ యాపిల్ టీని రెగ్యురల్‌గా ఒక కప్పు చప్పున తీసుకుంటే.
పొట్టు చుట్టు అదనంగా పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.అలాగే ప్రతి రోజు యాపిల్ టీ తీసుకోవడం వల్ల నీరసం, అలసట, తలనొప్పి, డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలు పరార్ అవుతాయి.
"""/"/
కీళ్ల నొప్పులను తగ్గించడంలోనూ యాపిల్ టీ ఉపయోగపడుతుంది.యాపిల్ టీలో ఉండే పోషక విలువల కీళ్లను దృఢంగా మార్చి.
నొప్పులను తగ్గిస్తాయి.ఇక యాపిల్ టీని తరచూ తీసుకోవడం వల్ల ముడతలు, మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి.
చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తంది.మరియు చర్మ ఛాయ కూడా పెరుగుతుంది.
ఇదిగో అమ్మాయిలు, ఈ టెక్నిక్ తెలిస్తే.. మిమ్మల్ని ఎవరూ వేధించలేరు!