అనేక జ‌బ్బుల‌ను దూరం చేసే ​`కీర‌దోస`!

కీర‌దోస‌.చాలా మంది ఇష్టంగా తినే ఆహారంలో ఇది కూడా ఒక‌టి.

శ‌రీర తాపాన్ని త‌గ్గించ‌డంలో కీర‌దోస అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ఎందుకంటే.

ఇందులో దాదాపు తొంబై శాతం వ‌ర‌కు నీరు ఉంటుంది.అలాగే బోలెడ‌న్ని జ‌బ్బుల‌ను దూరం చేయ‌డంతో పాటు సౌంద‌ర్య ప‌రంగా కూడా కీరదోస ఉప‌యోగ‌‌ప‌డుతుంది.

అందుకే చాలా మంది ప‌నిగ‌ట్టుకుని మ‌రీ కీర‌దోస ముక్కుల‌ను ప‌చ్చిగానే తింటుంటారు.ఇక కీర‌దోస తిన‌డం వ‌ల్ల ఏ ఏ ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అతి తక్కువ ధరకు లభించే కీరదోసలో విట‌మిన్ సి, కె పుష్క‌లంగా ఉంటాయి.

ఇందులో విటిమిన్ సి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెంచితే.విట‌మిన్ కె ఎముకుల‌ను, దంతాల‌ను దృఢంగా చేస్తుంది.

కీర‌దోస త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల‌ శరీరానికి కావాల్సిన‌ పీచు పదార్థం అందించి.జీర్ణ స‌మ‌స్య‌ల‌ను దూరంగా చేస్తుంది.

కీర‌దోస‌లో నీరు ఎక్కువ‌గా.దోసకాయ లో కేలరీలు తక్కువగా ఉంటాయి.

అందుకే బ‌రువు త‌గ్గాలనుకునే వారు కీర‌దోస డైట్ చేసుకుంటే.సులువుగా అధిక బ‌రువుకు చెక్ పెట్ట‌వ‌చ్చు.

మ‌రియు కీర‌దోస తీసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ స‌మ‌యం క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది.

త‌ద్వారా వేరే ఆహారం కూడా తీసుకోలే‌రు.ఇక అధిక రక్తపోటుతో బాధ‌ప‌డేవారు కీర‌దోస తీసుకుంటే.

ఇందులో ఉండే పొటాషియం బ్ల‌డ్ ప్రెజ‌ర్‌ను కంట్రోల్ చేస్తుంది.అలాగే గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్షిస్తుంది.

ఇక మ‌ధుమేహ రోగుల‌కు కూడా కీర‌దోస ఉప‌యోగ‌ప‌డుతుంది.త‌ర‌చూ కీరదోస తీసుకోవ‌డం వ‌ల్ల‌ రక్తంలో ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే గర్భాశయ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్స‌ర్‌ వంటి వివిధ రకాలైన క్యాన్సర్ల నుంచి ర‌క్షించ‌గ‌లిగే శ‌క్తి కీర‌దోసకు ఉంది.

మ‌రియు మూత్ర పిండాల‌ను శుభ్రపరచడంలో, టాక్సిన్స్ ను బయటకు పంప‌డంలో కూడా కీర‌దోస ఉప‌యోగ‌ప‌డుతుంది.

కాబ‌ట్టి, కీర‌దోస‌ను త‌ర‌చూ తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.

వీడియో: పూటుగా తాగిన వరుడు.. వధువు అనుకుని మరదలు మెడలో మాల వేశాడు..??