వార్నీ… ఏడిస్తే కూడా ఇన్ని లాభాలు ఉన్నాయా??

ఆరోగ్యంగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు.ఎందుకంటే.

ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడే ఆనందంగా, ప్ర‌శాంతంగా ఉండ‌గ‌ల‌రు.అందుకే ఆరోగ్యం కోసం అనేక ప్ర‌య‌త్నాలు చేస్తారు.

పోష‌కాహారం, వ్యాయామం, యోగా ఇలా ఎన్నో చేస్తుంటారు.అయితే ఏడిస్తే కూడా ఆరోగ్యానికి మంచిదే అంటే న‌మ్ముతారా.

? మీరు న‌మ్మినా.న‌మ్మ‌క‌పోయినా ఇది నిజం.

మనిషి పుట్టగానే గురువు లేకుండా తల్లి ఒడిలోనే నేర్చుకునే తొలి విద్య ఏడుపే.

అలాంటి ఏడుపు వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఏడ‌వ‌డం వ‌ల్ల కన్నీళ్లలో కొన్ని విషపూరిత అంశాలు బయటకు వస్తాయి.

ఇది శరీరంలోని ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది.త‌ద్వారా ఒత్తిడి త‌గ్గుతుంది.

"""/" / అలాగే ఏడ‌వ‌డం వ‌ల్ల‌ కంటికి తేమను ఇస్తుంది.ఏడుపు కళ్ళ పొడిదనం, ఎరుపు మరియు దురదను నివారించవచ్చు.

ఏడవడం వల్ల మీ మనసులోని బాధంతా ఒకేసారి కన్నీళ్ల రూపంలో బయటకు వెళ్లిపోతుంది.

దీంతో ఏడ్చిన తరువాత మనసు మునుపటికంటే చాలా తేలికగా ఉంటుంది.అలాగే దుఃఖం, విషాదం కలిగినప్పుడు గుండె ఆ బాధతో బరువెక్కుతుంది.

ఈ బాధ వ‌ల్ల ఒక్కోసారి గుండె పోటు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంటుంది.

అయితే, ఇలాంటి స‌మ‌యంలో తనివితీరా ఏడ్వడం వల్ల ఆ బాధ త‌గ్గ‌డంతో పాటు గుండె పోటు వ‌చ్చే రిస్క్‌ను త‌గ్గిస్తుంది.

అంతేకాదు, ఏడిస్తే డిప్రెషన్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.మొత్తానికి ఏడ్చిన తర్వాత ఆనందంగా ఉంటారట.