చుక్కకూర గురించి ఈ విషయాలు తెలిస్తే తినకుండా ఉండలేరు!
TeluguStop.com
మన ఆరోగ్యానికి, ఆకు కూరలకు విడదీయలేని సంబంధం ఉంది.చౌక ధరలకే లభించే ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉన్నాయి.
వాటిల్లో చుక్కుకూర కూడా ఒకటి.కానీ, చుక్కకూర గురించి చాలా మందికి తెలీదు.
చుక్కకూరను ఇప్పటి వరకు తినని వారు కూడా ఎందరో ఉన్నారు.అయితే ఈ ఆకుకూర గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటే ఖచ్చితంగా డైట్‌లో చేర్చుకుంటారు.
చుక్కకూర మ్యాజిక్ అలాంటిది మరి.ఇంకెందుకు ఆలస్యం చుక్క కూరలతో ఏయే ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చో తెలుసు కుందాం పదండీ.
రుచి పరంగానే కాదు చుక్కకూరలో పోషకాలూ మెండుగా ఉంటాయి.ముఖ్యంగా చుక్క కూరలో ఉండే ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారించడంలో గ్రేట్‌గా సహాయ పడుతుంది.
అందువల్ల, వారంలో రెండు లేదా మూడు సార్లు చుక్కకూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటే రక్త హీనత సమస్య పరార్ అవుతుంది.
అలాగే జీర్ణ వ్యవస్థకు చుక్కకూర ఎంతో మేలు చేస్తుంది.తరచూ చుక్క కూరను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పని తీరు చురుగ్గా మారుతుంది.
ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌తో బాధ పడే వారు ఖచ్చితంగా చుక్క కూరను తీసుకోవాలి.
తద్వారా అందులో ఉండే పలు పోషకాలు మూత్ర మార్గంలో ఏర్పడిన ఇన్ఫెక్షన్‌ను సమర్థవంతంగా తగ్గిస్తాయి.
"""/" /
చుక్కకూరలో విటమిస్ సి తో పాటు శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
అందు వల్ల, ఈ ఆకుకూరను డైట్‌లో చేర్చుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది.
అంతే కాదు, చుక్క కూర తీసుకుంటే బాడీ వెయిట్ అదుపులో ఉంటుంది.కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కాలేయ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.మరియు క్యాన్సర్ వచ్చే రిస్క్ సైతం తగ్గు ముఖం పడుతుంది.
కాబట్టి, ఇకపై చుక్కకూర కనిపిస్తే అస్సలు వదిలిపెట్టవద్దు.
కెరియర్ స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ ఇంత కష్టపడ్డాడా..? ఆయన ఎంతైనా గ్రేట్ అబ్బా…