ప‌ర‌గ‌డుపున మిరియాలు తీసుకుంటే.. ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

మిరియాలు.వీటి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

ఘాటైన రుచి, వాస‌న క‌లిగి ఉండే మిరియాలను వంట‌ల్లో రుచి కోసం విరి విరిగా వాడుతుంటారు.

ముఖ్యంగా నాన్ వెజ్ వంట‌ల్లో మిరియాల ఘాటు త‌గిలితే.రుచి అద్భుతంగా ఉంటుంది.

ఇక రుచి ప‌రంగానే కాకుండా మిరియాల్లో పోష‌కాలు కూడా మెండుగానే ఉంటాయి.విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ కె, క్యాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్‌, ఫాస్పరస్‌, కెరొటీన్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు మిరియాల్లో ఉంటాయి.

అందుకే మిరియాలు ఆరోగ్యానికి మంచివ‌ని నిపుణులు చెబుతుంటారు.అయితే ఎప్పుడు ప‌డితే అప్పుడు కాకుండా.

ప‌ర‌గ‌డుపున మిరియాల‌ను తీసుకుని అదిరిపోయే బెనిఫిట్స్ పొందొచ్చ‌ని అంటున్నారు.అవేంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ప్ర‌తి రోజు మిరియాల పొడిని వాట‌ర్‌లో మ‌రిగించి.అర గ్లాస్ చ‌ప్పున తీసుకోవాలి.

ఇలా చేస్తే వాంతులు, వికారం, నీర‌సం, అల‌స‌ట స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.మ‌రియు శ‌రీర శ‌క్తి రెట్టింపు అవుతుంది.

ఫుల్ యాక్టివ్‌గా మార‌తారు.అలాగే ప‌ర‌గ‌డుపున మిరియాల పొడిని వేసి మ‌రిగించిన నీటిని తీసుకుంటే.

శ‌రీరంలో పేరుకుపోయిన అదున‌పు కొవ్వు క‌రుగుతుంది.దాంతో మీరు స్లిమ్‌గా, అందంగా మార‌తారు.

చాలా మంది మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్యతో బాధ ప‌డుతూ ఉంటాయి.అలాంటి వారు ప‌ర‌గ‌డుపున మిరియాల పొడిని తేనెతో క‌లిపి తీసుకుంటే.

మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య క్ర‌మంగా దూరం అవుతుంది.అంతేకాదు.

గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి జీర్ణ స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయి.

ఇక ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో చిటికెడు మిరియాల పొడి వేసి ప‌ర‌గ‌డుపున‌ తీసుకోవాలి.

ఇలా చేస్తే.శ‌రీరం నుండి టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.

దాంతో చ‌ర్మం తేమ‌గా మ‌రియు ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టులో విచారణ