బీట్‌రూట్‌ను డైరెక్ట్‌గా కాదు.. ఇలా తీసుకుంటే మస్తు బెనిఫిట్స్‌!

బీట్‌రూట్‌.దీని గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే.

పోష‌కాలు మెండుగా ఉండే దుంప‌ల్లో బీట్‌రూట్ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.అందులో ఎటువంటి సందేహం లేదు.

విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె, ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌, ఫైబ‌ర్ ప్రోటీన్ ఇలా ఎన్నో పోష‌కాలు బీట్‌రూట్‌లో నిండి ఉంటాయి.

అందుకే ఇది ఆరోగ్య ప‌రంగా బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.అయితే చాలా మందికి బీట్‌రూట్ ఇష్టం ఉండ‌దు.

బీట్‌రూట్ ఫ్లేవ‌ర్ అంటేనే చిరాకు ప‌డుతుంటారు.ఈ క్ర‌మంలోనే దానిని దూరం పెట్టేస్తూ.

ఎన్నో ఆరోగ్య లాభాల‌ను మిస్ చేసుకుంటారు.ఈ లిస్ట్ లో మీరు ఉన్నారా.

? అయితే ఇక‌పై చింతించ‌కండి.ఎందుకంటే, బీట్‌రూట్‌ను డైరెక్ట్‌గా కాకుండా.

ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే టేస్ట్ తో పాటు మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్ ను సైతం పొందొచ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం బీట్‌రూట్‌ను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ. """/"/ ముందుగా ఒక చిన్న సైజ్ బీట్ రూట్‌ను తీసుకుని పీల్ తొల‌గించి వాట‌ర్‌లో క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే ఒక దానిమ్మ పండు తీసుకుని.అందులో ఉన్న గింజ‌ల‌ను వేరు చేసుకోవాలి.

మ‌రోవైపు రెండు ఆరెంజ్ పండ్ల‌ను మ‌ధ్య‌లోకి క‌ట్ చేసి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేయాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో బీట్‌రూట్ ముక్క‌లు, దానిమ్మ గింజ‌లు, క‌ప్పు వాట‌ర్, రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగ‌ర్ వేసి మెత్త‌గా బ్లెండ్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత స్ట్రైన‌ర్ సాయంతో బీట్‌రూట్‌, దానిమ్మ ప‌ల్ప్ నుంచి జ్యూస్ ను వేరు చేసుకోవాలి.

ఇక ఈ జ్యూస్‌లో ఆరెంజ్ జ్యూస్‌ను యాడ్ చేసి సేవించాలి.ఈ విధంగా బీట్ రూట్‌ను దానిమ్మ‌, ఆరెంజ్‌తో క‌లిపి తీసుకుంటే ర‌క్త‌హీన‌త దూరం అవుతుంది.

బ్లెడ్ ప్రెజ‌ర్ కంట్రోల్ లో ఉంటుంది.గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

నీర‌సం, అల‌స‌ట వంటివి త‌ర‌చూ వేధించ‌కుండా ఉంటాయి.లైంగిక స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

మ‌రియు మెడ‌దు కూడా చురుగ్గా మారుతుంది.

రెండు రోజుల్లో జలుబు తగ్గాలంటే ఈ టీ తాగండి!