బనానా టీ తాగితే..ఈ అదిరిపోయే బెనిఫిట్స్ మీసొంతం!

అత్య‌ధికంగా వినియోగించే పండ్ల లిస్ట్‌లో అర‌టి పండు (బ‌నానా) ఒక‌టి.పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంద‌రో అర‌టి పండును ఇష్టంగా భుజిస్తుంటారు.

ఏ సీజ‌న్‌లో అయినా ల‌భించే అర‌టి పండ్లు అద్భుత‌మైన రుచి క‌లిగి ఉండ‌టంతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్‌, పొటాషియం, సోడియం, జింక్‌, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ బి, ప్రోటీన్‌, ఫైబ‌ర్ ఇలా ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే బోలెడ‌న్ని పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.

ఇక అర‌టి పండుతో కొంద‌రు ప‌లు రెసిపీలు కూడా చేస్తారు.వాటిలో బ‌నానా టీ (అర‌టి పండు టీ) ఒక‌టి.

ఈ టీ టేస్టీగా ఉండ‌ట‌మే కాదు.హెల్త్‌కు కూడా ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా నిద్ర లేమి స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డంలో అర‌టి పండు టీ గ్రేట్‌గా స‌మాయ‌ప‌డుతుంది.

ప్ర‌తి రోజు నిద్రించే ముందు అర‌టి పండు టీ తీసుకుంటే మంచి ప్ర‌శాంత‌మైన నిద్ర పడుతుంది.

"""/" / అలాగే వ్యాయామం చేయ‌డానికి ముందు ఒక క‌ప్పు అర‌టి పండు టీ తీసుకోవాలి.

ఇలా చేస్తే అల‌స‌ట, నీర‌సం పోయి.ఫుల్ యాక్టివ్‌గా వ‌ర్క‌వుట్స్ చేస్తారు.

చాలా మంది క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అర‌టి పండును దూరం పెడ‌తారు.కానీ, అర‌టి పండు టీలో క్యాల‌రీలు త‌క్కువ‌గా, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది.

అందువ‌ల్ల‌, బ‌నానా టీ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వొచ్చు.అంతేకాదు, బ‌నానా టీ తాగితే అధిక ఒత్తిడి, త‌ల‌నొప్పి, నిరాశ, ఆందోళన వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా మెరుగు ప‌డుతుంది.

మ‌రి ఇంత‌కీ బ‌నానా టీ ఎలా చేయాలంటే.పండిన అర‌టి పండును తీసుకుని శుభ్రంగా క‌డిగి.

తొక్క‌తో పాటే ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు వాట‌ర్‌లో అర‌టి పండు ముక్క‌లు, కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి మ‌రిగించి.

వ‌డ‌బోసుకోవాలి.ఇప్పుడు ఇందులో కొద్దిగా తేనె క‌లిపి.

సేవించాలి.

పాన్ ఇండియాలో కూడా మార్కెట్ లేని మహేష్ బాబు తో రాజమౌళి భారీ రిస్క్ చేస్తున్నాడా..?