డయాబెటిస్‌కు చెక్ పెట్టే యాపిల్ సైడెర్ వెనిగర్.. ఎలాగంటే?
TeluguStop.com
డయాబెటిస్ లేదా మధుమేహం.నేటి కాలంలో మారిన జీవినశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
డయాబెటిస్ ఉన్న వారు ఎప్పుడూ మందులు వాడ్సాల్సి ఉంటుంది.స్వీట్స్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
బరువు మరియు షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది.ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే డయాబెటిస్‌ను అదుపు చేయడంలో యాపిల్ సైడెర్ వెనిగర్ గ్రేట్‌గా సహాయపడుతుంది.మరి యాపిల్ సైడెర్ వెనిగర్‌ను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ సైడెర్ వెనిగర్ అంటే ఇది కూడా యాపిల్ జ్యూసే.అయితే దీంట్లో ఈస్ట్ కలుపుతారు.
ఇక ఈ యాపిల్ సైడెర్ వెనిగర్‌ను ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ నీటిలో కలిపి తీసుకోవాలి.
లేదా వంటల్లో, సలాడ్స్‌లో, టీలో కలిపి తీసుకోవచ్చు.ఇలా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి అదుపులో ఉంటాయి.
మరియు టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇన్సులిన్ లెవెల్స్ పెరిగేలా చేస్తుంది.ఇక యాపిల్ సైడెర్ వెనిగర్‌తో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
యాపిల్ సైడెర్ వెనిగర్ ఉదయం నీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయి ఉన్న కేలరీలు కరిగి.
అధిక బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.అలాగే యాపిల్ సైడెర్ వెనిగర్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించి.
మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది.దీంతో గుండె పోటు, ఇతర గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది మరియు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
అయితే యాపిల్ సైడర్ వెనిగర్‌ను నేరుగా తీసుకోరాదు.అదే సమయంలో ఎక్కువగా కూడా తీసుకోరాదు.
ఎందుకంటే, యాపిల్ సైడెర్ వెనిగర్‌ను అతిగా తీసుకోవడం వల్ల దంతాల సమస్యలు మరియు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఆ హీరోయిన్ జాతకాన్ని కళ్యాణ్ రామ్ మారుస్తాడా.. ఆ మూవీపైనే ఆశలు పెట్టుకుందిగా?