కలబంద ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!
TeluguStop.com
కలబంద(అలోవెరా).దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి పేరటిలోనూ కలబంద మొక్క ఉంటోంది.కలబందను ఆయుర్వేద వైద్యంలో, బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో విరివిగా యూజ్ చేస్తున్నారు.
కలబంద చూడటానికి ముళ్లతో పిచ్చి మొక్కలాగా కనబడుతుంది.కానీ, మన ఆరోగ్యానికి ఇది చేసే మేలు అద్భుతం అని చెప్పాలి.
ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచడంలో కలబంద గ్రేట్‌గా పనిచేస్తుంది.ఎందుకంటే.
కలబందలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.అందుకే ఉదయం కలబంద గుజ్జును నీటిలో కలిపి తాగమని నిపుణులు చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల వ్యాధులు, వైరల్ ఇన్‌ఫెక్షన్లు కూడా దరిచేరకుండా ఉంటాయి.ఈ కలబంద జ్యూస్ తాగడం వల్ల జీర్ణసమస్యలు తగ్గుముఖం పడతాయి.
అంతేకాకుండా, శరీరంలో ఉండే విష పదార్థాలు మొత్తం బయటకు పంపే శక్తి కలబందకి పుష్కలంగా ఉంది.
అందుకే ప్రతిరోజు రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జు తీసుకోమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరో ఉపయోగం ఏంటంటే.ప్రతిరోజు కలబంద గుజ్జు తీసుకోవడం వల్ల అధిక బరువుకు కూడా చెక్ పెట్టవచ్చు.
అలాగే కలబంద గుజ్జుకు నీళ్లు కలిపి దాన్ని మౌత్‌వాష్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు.
ఇలా చేయడం వల్ల దంత సమస్యలు, చిగుళ్లు సమస్యలు తగ్గుతాయి.మరియు నోట్లో ఉండే క్రిములు నశనం అవుతాయి.
ఇక ప్రతిరోజు ఉదయం కలబంద జ్యూస్ తాగడం వల్ల షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి.
తన చేతివంటను రుచి చూపించిన నాగ చైతన్య.. వీడియో వైరల్