పింక్ సాల్ట్.. అందం, ఆరోగ్యం రెండిటినీ పెంచుతుందని మీకు తెలుసా?
TeluguStop.com
ఉప్పు(సాల్ట్) లేకుండా రోజూవారీ వంటలను చేయడం అసాధ్యం.మన నిత్యజీవితంలో ఉప్పు అనేది ఓ కీలక పాత్రను పోషిస్తుంది.
ఉప్పును ఎక్కువగా తీసుకున్నా లేదా తక్కువగా తీసుకున్నా శరీరానికి ముప్పు తప్పదు.అందుకే నిత్యం శరీరానికి అవసరమయ్యే ఉప్పును మాత్రమే అందించాల్సి ఉంటుంది.
అయితే ఉప్పులో ఎన్నో రకాలు ఉన్నాయి.అందులో హిమాలయన్ ఉప్పు కూడా ఒకటి.
దీనిని చాలా మంది పింక్ సాల్ట్ అని పిలుస్తుంటారు.ఇటీవల రోజుల్లో కోట్లాది మంది పింక్ సాల్ట్ ను ఉపయోగించేందుకే మొగ్గు చూపుతున్నారు.
హిమాలయాల్లోని రాతి స్పటికాలతో ఈ ఉప్పును తయారు చేస్తారు.ఖరీదు కాస్త ఎక్కువే అయినా.
ఈ పింక్ సాల్ట్ కి అందం, ఆరోగ్యం రెండిటినీ పెంచగల సామర్థ్యం పుష్కలంగా ఉంది.
సాధారణ ఉప్పు, సముద్ర ఉప్పుకు బదులుగా పింక్ సాల్ట్ ను రోజూవారీ వంటల్లో ఉపయోగిస్తే.
రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.అయోడిన్ కొరత ఏర్పడకుండా ఉంటుంది.
గుండె సంబంధిత జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
శ్వాస కోశ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది.ఎముకల సాంద్రత రెట్టింపు అవుతుంది.
మరియు జీర్ణ వ్యవస్థ సైతం సక్రమంగా పని చేస్తుంది.ఇక సౌందర్య పరంగా చూస్తే.
జిడ్డు చర్మాన్ని నివారించడంలో పింక్ సాల్ట్ సూపర్ గా హెల్ప్ చేస్తుంది. """/" / అందుకోసం మీరు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల పాటు వదిలేయాలి.
ఆపై వాటర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే చర్మంపై పేరుకుపోయిన జిడ్డు మొత్తం తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
"""/" /
అలాగే మొటిమలను, వాటి తాలూకు మచ్చలను వదిలించడంలోనూ పింక్ సాల్ట్ ఉపయోగపడుతుంది.
ఒక బౌల్‌లో వన్ టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్, స్మాల్ కప్ ఆఫ్ వాటర్, మూడు చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో నింపాలి.
ఆపై ఈ వాటర్‌ను ముఖానికి స్ప్రే చేసుకోవాలి.పూర్తిగా ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒక సారి చేస్తే మొటిమలు, మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు నిద్ర సరిపోవట్లేదు బాసు!