ఈ పైనాపిల్ షేక్ తో ఆరోగ్యం అందం రెండు మీ సొంతం!
TeluguStop.com
పైనాపిల్( Pineapple ) గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపించడమే కాదు ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచడానికి కూడా పైన అద్భుతంగా తోడ్పడుతుంది.
అయితే చాలా మంది పైనాపిల్ నేరుగా తినేందుకు ఇష్టపడరు.అలాంటివారు ఇప్పుడు చెప్పబోయే విధంగా పైనాపిల్ షేక్ ను తయారు చేసుకునే తీసుకుంటే సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
అందుకోసం బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు బాగా పండిన పైనాపిల్ ముక్కలు.
ఐదు నుంచి ఆరు వాటర్ లో గంటపాటు నానబెట్టిన జీడిపప్పులు, రెండు టేబుల్ స్పూన్లు తేనె, ఒక గ్లాస్ కొవ్వు తీసిన పాలు, పావు టీ స్పూను యాలకుల పొడి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
దాంతో మన పైనాపిల్ షేక్ అనేది రెడీ అవుతుంది.చివరిగా దీనిలో కొన్ని నట్స్ ను మిక్స్ చేసుకుని నేరుగా సేవించడమే.
వారానికి ఒకసారి ఈ పైనాపిల్ షేక్ ను తీసుకోవడం వల్ల పెద్ద మొత్తంలో మీరు ప్రయోజనాలు పొందుతారు.
పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండే బ్రోమెలైన్ ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది.
బ్యాక్టీరియాను చంపుతుంది.దగ్గు, జలుబు వంటి సమస్యలను నివారించవచ్చు.
అలాగే పైనాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి రోగ నిరోధక శక్తిని( Immunity ) పెంచడంతో పాటు మిమ్మల్ని అనేక రకాల వ్యాధుల నుండి కాపాడతాయి.
"""/" /
పైనాపిల్‌లో మెండుగా ఉండే కాల్షియం, మాంగనీస్ బలమైన శరీరాన్ని నిర్వహించడానికి మరియు ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి.
హైపర్‌టెన్షన్ తో బాధపడేవారు పైన చెప్పిన పైనాపిల్ మిల్క్ షేక్ ను వారానికి రెండుసార్లు తీసుకోండి.
పైనాపిల్ లో అధిక మొత్తంలో పొటాషియం మరియు తక్కువ మొత్తంలో సోడియం ఉన్నందున.
ఇది రక్తపోటు( Blood Pressure )ను అదుపులోకి తెస్తుంది. """/" /
పైనాపిల్ షేక్ ను తాగడం వల్ల అలసట నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండటానికి అవసరమయ్యే స్టామినా లభిస్తుంది.పైనాపిల్‌లో సెరోటోనిన్ ఉంటుంది.
ఇది మీ హార్మోన్లు మరియు నరాలను రిలాక్స్‌గా ఉంచే సహజ స్ట్రెస్ బస్టర్.
అందువల్ల స్ట్రెస్‌గా ఉన్నప్పుడు ఒక గ్లాస్ పైనాపిల్ షేక్ తీసుకుంటే తక్షణ ఉపశనం పొందుతారు.
ఇక చర్మానికి కూడా పైనాపిల్ ఎంతో మేలు చేస్తుంది.పైనాపిల్ లో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.
చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.స్కిన్ ను యవ్వనంగా, కాంతివంతంగా మెరిసేలా సైతం ప్రోత్సహిస్తుంది.
ఆ ప్రాంతంలో ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేసిన చిరంజీవి.. ఎన్ని రూ.కోట్లంటే?