కర్నూలులో హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం..!

కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.లోకాయుక్త కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కార్యాలయంలోని బాత్ రూమ్ లో తన ఎస్ఎల్ఆర్ గన్ తో కాల్చుకుని సత్యనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన సత్యనారాయణ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.లోకాయుక్త కార్యాలయ సిబ్బంది సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉదయం విధులకు హాజరైన సత్యనారాయణ వ్యక్తిగత ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేదా మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఓరి దేవుడా.. 8 కేజీల బిర్యానీ ఎలా తినేశావేంటి సామీ! వీడియో వైరల్