తుది శ్వాస వరకు అందరినీ నవ్విస్తూనే ఉంటా.. సుధీర్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
బుల్లితెర పై పలు కామెడీ షో లలో నటిస్తూ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈయన గాలోడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నారు.
రాజశేఖర్ రెడ్డి పులి చర్ల అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా శుక్రవారం విడుదల కావడంతో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుధీర్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ తనకు సినిమా లెక్కలు అన్ని ఏవి పూర్తిగా తెలియదు కానీ తనను నమ్మి తనకోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చుపెట్టిన నిర్మాతలు ఆ సినిమాని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదని మనసారా కోరుకుంటున్నాననీ తెలిపారు.
మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్న అంటూ గాలోడు సినిమాపై ఆశాభావం వ్యక్తం చేశారు.
"""/"/
ఇకపోతే కరోనా వంటి విపత్కర పరిస్థితిలో చూసిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందనే విషయం ఎవరికీ తెలియదు అందుకే ఉన్నన్ని రోజులు ఎంతో సంతోషంగా నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉండాలని నిర్ణయించుకున్నాను.
అది వెండితెర అయినా బుల్లితెర అయినా తుది శ్వాస విడిచే వరకు తాను అందరిని నవ్విస్తూనే ఉంటానని ఈయన తెలిపారు.
హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నానని తాను హీరో అనే చట్రంలో ఇరుక్కుపోనని,బుల్లితెర పై అలాగే వెండితెరపై తాను సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా సుధీర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియో చూస్తే భారతీయులుగా సిగ్గుపడతారు!