గౌరవానికి భంగం కలిగితే రాజకీయాలు వదులుకుంటా..: మంత్రి పినిపే
TeluguStop.com
సీఎం సభలో కింద కూర్చోవడంపై మంత్రి విశ్వరూప్ వివరణ ఇచ్చారు.కాళ్లు పట్టుకునే సంస్కృతి తనకు లేదన్నారు.
అదేవిధంగా తాను అందరి వద్ద గౌరవంగా ఉంటానని తెలిపారు.దళిత మంత్రికి అవమానమని చెప్పడం సరికాదని మంత్రి విశ్వరూప్ అన్నారు.
సీఎం తన పట్ల గౌరవంగా ఉంటారని, తాను ఆయన పట్ల గౌరవంగానే ఉంటానని తెలిపారు.
తనను కించపరిచారనే విషయం వాస్తవం కాదని తేల్చి చెప్పారు.తన గౌరవానికి భంగం కలిగితే రాజకీయాలను వదులుకుంటానని స్పష్టం చేశారు.
అమెరికాలో హైదరాబాద్ యువకుడు దారుణ హత్య..