అంధ గాయకుడిని ఉద్దేశించి థమన్ పోస్ట్ వైరల్.. అతడిలో గొప్ప టాలెంట్ ఉందంటూ?

టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు.ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది.

అది కేవలం సమయం సందర్భం బట్టి బయటకు వస్తూ ఉంటుంది.అలా ఊహించని టాలెంట్ తో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వారు చాలామంది ఉన్నారు.

అలాంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక అంద యువకుడు కూడా ఒకరు.

తాజాగా సోషల్ మీడియాలో ఒక అంద యువకుడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

బస్సులో ప్రయాణిస్తున్న ఆ యువకుడు పాడిన పాటకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఈ వీడియో పై స్పందిస్తున్నారు.

"""/" / ఆ పిల్లవాడు పాడిన వీడియో ప్రతి ఒక్కరి మనసులను కదిలించింది.

ఆ వీడియో పై స్పందించిన.ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్( RTC MD Sajjanar ) ఈ యువ‌కుడికి ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణిని( MM Keeravani ) కోరారు.

మనం చూడాలే కానీ.ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో, ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా, ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్‌’ అని సజ్జనార్ ట్వీట్ చేసారు.

అయితే తాజాగా ఈ యువ‌కుడిని ఉద్దేశించి సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్( Thaman ) పోస్ట్ చేశారు.

నేను వాగ్ధానం చేస్తున్నాను. """/" / ఈ అబ్బాయి క‌చ్చితంగా తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 4లో( Telugu Indian Idol 4 ) పాడుతాడు.

అత‌డిలో గొప్ప టాలెంట్ ఉంది.అత‌డితో క‌లిసి నేను పాడ‌తాను.

దేవుడు కొన్నిసార్లు కఠినంగా ఉన్నట్లు కనిపిస్తాడు.అయితేనేం అతడి టాలెంట్‌ను గుర్తించి అవకాశం ఇవ్వడానికి మనం ఉన్నాం కదా అని త‌మ‌న్ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు.

జనసేన లోకి వారంతా క్యూ … టీడీపీ నేతల్లో ఆగ్రహం ?