మొస‌లితో గేమ్స్ ఆడాల‌నుకున్నాడు.. కానీ ఇంత‌లోనే..

భూమ్మీద సింహాలు, పులులు ఎంత డేంజ‌రో నీటిల మొస‌లి కూడా అంతే డేంజ‌ర్‌.

అది నీటిలో ఉందంటే వెయ్యి ఏనుగుల బ‌లంతో ఉంటుంది.అది దాడి చేసిందంటే ప్రాణాలు గాల్లో క‌లిసిన‌ట్టే.

ఏ మాత్రం బ‌తికేందుకు అవ‌కాశాలు ఉండ‌వు.దాని ప‌ట్టు ముందు చిరుత పులులు కూడా ప్రాణాలు విడుస్తాయంటే ఎంత బ‌లంగా దాడి చేస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు.

అదే స‌మ‌యంలో దాని వ‌ల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్న మ‌నుషుల‌ను కూడా చూస్తున్నాం.ప్ర‌శాంతంగా ఉన్న కుంట‌లోకి దిగి చివ‌ర‌కు మొస‌లి బారిన ప‌డుతున్న వారు అనేకం ఉన్నారు.

ఇలాంటి మొస‌ళ్ల దాడుల‌కు సంబంధించిన వీడియోలు అనేకం నెట్టింట్లో వైర‌ల్ అవుతుంటాయి.ఇలాంటి వీడియోలు చూసిన‌ప్పుడు అయినా వాటికి దూరంగా ఉండాల‌నే ఆలోచ‌న రావాలి.

కానీ మాత్రం అన‌వ‌స‌రంగా మొస‌ళ్ల జోలికి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.అదేం స‌ర‌దానో ఏమో అర్థం కావ‌ట్లేదు గానీ కొంద‌రు మాత్రం ఇలాంటి అన‌వ‌స‌ర స‌ర‌దాల‌కు పోతున్నారు.

ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి ఇలాగే మొస‌లి జోలికి పోయి చివ‌ర‌కు ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు.

ఈ వైర‌ల్ వీడియోలో ఓ వ్యక్తి మొసలి ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. """/"/ దాన్ని ద‌గ్గ‌రి నుంచి ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్ర‌య‌త్నించాడు.

ఇక దాన్ని కొంచెం అటు ఇటూ క‌ద‌ల‌మ‌ని చెబుతున్న‌ట్టు మ‌న‌కు ఇందులో క‌నిపిస్తుంది.

ఇలా చేయ‌డంతో ఆ మొస‌లికి తీవ్ర కోపం వ‌స్తుంది.అయితే అది దాడి చేసేందుకు రెడీ అవుతున్న త‌రుణంలోనే అక్క‌డి నుంచి పారిపోతాడు.

ఇలా కొద్దిలో త‌ప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు.ఇలా అత‌ను చేసిన సాహ‌సానికి సంబంధించిన వీడియో నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

దాన్ని చూసిన వారంతా ఇలాంటి సాహ‌సాలు అవ‌స‌ర‌మా బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఐపిఎల్ ఈ సీజన్ ముగిసే సమయానికి టాప్ హిట్టర్లుగా నిలిచే ప్లేయర్లు ఎవరంటే..?