వ్యాయామం చేయాలనుకున్నాడు.. కానీ ఏమైందో చూస్తే నవ్వులే
TeluguStop.com
పొద్దున్నే లేచి వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే.ఉదయం పూట ఓ అరగంట సేపు చేసే వ్యాయామం మనల్ని రోజంతా ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇక కొంచెం లావుగా ఉన్న వారయితే ఆరోగ్యం కోసం చేయని వ్యాయామాలు ఉండవేమో అనిపిస్తుంది.
ఇలాంటి వారి కోసం ఈ నడుమ కొన్ని కంపెనీలు కూడా పుట్టుకొస్తున్నాయి.అయితే ఇలాంటి యోగాలకు సంబంధించిన కొన్ని వీడియోలుఅప్పుడప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ కావడాన్ని కూడా మనం చూస్తున్నాం.
ఇందులోకొన్ని ఫన్నీగా కూడా ఉంటాయి.ఇప్పుడు కూడా ఇలాంటి ఓ ఫన్నీ వీడియోను మీ ముందుకు తీసుకురాబోతున్నాం.
దీన్ని చూసిన తర్వాత మీరు పడి పడి నవ్వలేకుండా ఉండలేరేమో.దీన్ని చూసిన నెటిజన్లు చాలా ఫన్నీగా కామెంట్లు పెట్టేస్తున్నారు.
అయితే ఇందులో ఓ వ్యక్తి ఏదో చేయబోయి దారుణంగా ఫల్టీలు కొట్టేశాడండోయ్.దీన్ని చూశాక మీరు కూడా కాసేపు నవ్వుకుంటారంటే నమ్మండి.
ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి పొద్దున్నే వ్యాయామం చేసేందుకు తన మేడ మీదకు వెళ్తుంటాడు.
ఇలా అక్కడే ఉన్న ఓ బెంచ్ మీద కూర్చొని వ్యాయామం చేయడం మనం చూడొచ్చు.
"""/"/
ఇలా బెంచ్ మీద కూర్చున్న ఆ వ్యక్తి కొన్ని రకాల వ్యాయామాలు చేస్తూ చివరకు ఏదో కొత్త రకం చేయాలని అనుకుంటాడు.
బెంచ్‌పై కూర్చుని మెడను వెనుకకు వాల్చేందుకు ప్రయత్నిస్తాడు.అయితే ఈ క్రమంలోనే బ్యాలెన్స్ తప్పిపోయి వెనక్కి పడిపోవడం మనం ఇందులో చూడొచ్చు.
ఇక సినిమాల్లో మాదిరిగా పైకి లేచి అటు ఇటూ చూస్తూ ఎవరూ చూడలేదుగా అని అనుకుంటూ మళ్లీ ఎక్సర్ సైజ్ స్టార్ట్ చేస్తాడు.
అయితే ఇది కాస్తా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయిపోయింది.ఇంకేముంది దాన్ని కాస్తా సోషల్ మీడియాలో పెట్టేయడంతో విపీరతంగా హల్ చల్ అవుతోంది.
ఛావా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఆ తేదీన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందా?