వైరల్ అయ్యేందుకు స్టంట్ చేద్దామనుకున్నాడు.. చివరకు అతని పరిస్థితి?
TeluguStop.com
ప్రస్తుత రోజులలో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఎంతటి సాహసాన్ని చేయడానికి అయినా సిద్ధమవుతున్నారు.
సోషల్ మీడియాలో రీల్స్ కోసం వారి ప్రాణాల సైతం లెక్కచేయకుండా ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.
ఒక్కోసారి వారు చేసే ప్రయత్నాలు ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్త పడుతూ ఉంటే.
మరికొన్నిసార్లు ప్రాణాలు సైతం పోయిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.అందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో అనేకం ఉన్నాయి.
ప్రస్తుతం అచ్చం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
"""/" /
ఇకపోతే, వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక కుర్రవాడు నడిరోడ్డు పై స్కేటింగ్ చేస్తూ ప్రమాదకరమైన స్టంట్స్ చేసే ప్రయత్నం చేశాడు.
స్కేటింగ్ మాస్క్ ధరించి రోడ్డుపైకి వచ్చాడు.ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఒక కారును పట్టుకొని దాని వెనకాల వెళ్లేందుకు ప్రయత్నం చేయగా.
బ్యాలెన్స్ కాస్త తప్పి కింద పడిపోయాడు.వేగంగా వెళుతున్న కారు నుంచి ఇలా బాలన్స్ తప్పడంతో పలుసార్లు పల్టి కొడుతూ కింద పడ్డాడు ఆ యువకుడు.
అయితే, అదృష్టం ఏమిటంటే.ఆ సమయంలో ఆ రోడ్డుపై ఎటువంటి వాహనాలు రాకపోవడంతో అతడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను.
ఇక ఈ సంఘటన మొత్తం బైకు మీద వస్తున్న అతని ఫ్రెండ్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇక ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్స్ ఆ యువకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రీల్స్ కోసం ఇలాంటి రిస్కులు చేయడం అవసరమా.బ్రో అని కామెంట్ చేస్తూ ఉంటే.
ఇక మరికొందరు అయితే, రోడ్డుపై వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బంపర్ ఆఫర్ . . వారందరికీ రెండేళ్లపాటు యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ..