గాడిదతో పెట్టుకున్నాడు.. చివరికి దూల తీరింది.. వీడియో చూస్తే..!
TeluguStop.com
మనుషులు తమకు కనిపించిన మూగ జంతువుల పట్ల కనికరం చూపించడం సహజం.కొందరు మాత్రం కనికరం చూపడం అటుంచితే.
వాటిని బాగా హింసిస్తారు.వాటిని చాలా ఘోరంగా కొడుతూ హృదయం లేని వారిలా ప్రవర్తిస్తారు.
పాపం అవి ఎంత మోత్తుకున్నా జాలి చూపించరు.వాటినలా కొడుతూనే ఉంటారు.
తాజాగా ఒక యువకుడు ఒక గాడిద పట్ల చాలా కౄరంగా వ్యవహరించాడు.నిజానికి గాడిదలు చాలా కష్టపడుతుంటాయి.
వీటి చేత ప్రజలు భారీగా బరువులు మోయిస్తుంటారు.వెహికల్స్ కూడా వెళ్లలేని ప్రదేశాల్లో వీటిని తిప్పుతూ నానా హింసకు గురిచేస్తారు.
అంతలా చాకిరీ చేసేవాటిని యజమానులు మంచిగా చూసుకోరు కూడా.ఇష్టమొచ్చినట్లు వాటిని కొడుతుంటారు.
తాజాగా వైరల్ అయిన వీడియోలో కూడా ఒక యువకుడు గాడిదను తన్నడం, కర్రలతో కొట్టడంతో, ముఖం పై పంచుల వర్షం కురిపించడం లాంటివి చేశాడు.
అతడి దాడితో ఆ గాడిద తల్లడిల్లిపోయింది.ఈ వీడియో చూస్తుంటేనే కోపం కట్టలు తెంచుకుంటుంది.
అలాంటిది ఆ గాడిదకి ఇతడిపై చాలా కోపం పెరిగి పోయింది.ప్రతీకారం తీర్చుకోవాలని అది సరైన సమయం కోసం ఎదురు చూసింది.
ఇంతలోనే అతడు దానిపై స్వారీ చేయడానికి వీపు మీదకు ఎక్కాడు.అదే అదనుగా భావించిన ఆ గాడిద అతని కాలును గట్టిగా నోట కరచుకుంది.
అది దాని బలమైన పళ్ల కింద అతని కాలును పచ్చడి చేసింది.అది తన కాలును కొరుకుతున్నప్పుడు ఆ బాధ భరించలేక ఆ యువకుడు ఆ ప్రాంతమంతా దద్దరిల్లేలా గట్టి గట్టిగా అరిచేసాడు.
అయినా కూడా ఆ గాడిద నీకిలాగే జరగాలంటూ అతడికి తగిన శాస్తి చేసింది.
వీడియో తీస్తున్న వ్యక్తి గాడిదను ఆపేందుకు ముందుకు కూడా రాలేదు.ఈ దృశ్యాలను మాత్రం చాలా క్లారిటీగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు అబ్బా, ఈ గాడిద సూపర్, ఆ నీచుడికి తగిన బుద్ధి చెప్పిందని పొగుడుతున్నారు.
హరిహర వీరమల్లు, పుష్ప 2 సినిమాలు పోటీ పడితే ఏం జరుగుతుంది…